
మేం చిరుకు రాజకీయ తమ్ముళ్లం: డొక్కా
భావోద్వేగాలు, ఆవేశంతో ప్రజలకు న్యాయం జరగదని, ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన చెబుతున్న సామాజిక న్యాయాన్ని ఆచరించి చూపుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకే అందుకే చిరంజీవి తాను స్థాపించిన పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని చెప్పారు. చిరంజీవికి పవన్ సొంత తమ్ముడైతే, తనలాంటి దళితులమంతా చిరంజీవికి రాజకీయ తమ్ముళ్లమని డొక్కా అన్నారు.