మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ :
జిల్లాలో 2013లో నేరాల సంఖ్యను అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే చాలా వరకు తగ్గించగలిగామని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ నిర్భయ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. నిర్భ య చట్టం అమలులో ఉన్నప్పటికీ మహిళలపై, ప్రత్యేకించి బాలికలపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చేం దుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మీడియా భాగస్వామ్యం కావాలి..
నిర్భయ చట్టం అమలులో మీడియా ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఎస్పీ తెలి పారు. బాలికలపై లైంగికదాడులు జరిగినపుడు సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అలా ఫిర్యాదు చేయని పక్షంలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్స్యు వల్ అఫెన్సెస్ -2013 యాక్టు ప్రకారం సంబంధిత సంస్థపై కేసుల నమోదుకు వీలుందన్నారు. నిత్యం విధులతో సతమతమయ్యే పోలీసులకు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. 40 ఏళ్ల వయస్సు కలిగిన సిబ్బందికి ఈ చెకప్‌లు చేయిస్తున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు 750 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుల కుటుంబాలకు కూడా చెకప్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
15 రిసెప్షన్ హాళ్లకు ప్రతిపాదనలు..
జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ హాళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్పీ చెప్పారు. ఒక్కో స్టేషన్‌లో రూ. 50 లక్షల వ్యయంతో వీటిని నిర్మించాలని నిర్ణయించి, ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.
త్వరలో మెరైన్ స్టేషన్‌ల నిర్మాణం...
జిల్లాలో మూడు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. వాటిలో గిలకలదిండి స్టేషన్‌కు మాత్రమే సొంత భవనం ఉందన్నారు. ఒర్లగొందితిప్ప, పాలకాయతిప్ప మెరైన్ స్టేషన్‌లకు భవనాల నిర్మాణం త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జగ్గయ్యపేట, హనుమాన్‌జంక్షన్, గుడివాడ డివిజన్లలో మాత్రమే సీసీ కెమేరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం, నందిగామ, పామర్రు, కంచకచర్లలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డయల్-100కు మంచి స్పందన వస్తోందన్నారు. సమావేశంలో బందరు డీఎస్పీ డాక్టర్ కె.శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ బి.చంద్రశేఖర్, డీసీఆర్‌బీ, ఎస్‌బీ సీఐలు పాల్గొన్నారు.
నేరాల సంఖ్య తగ్గించాం
Published Wed, Jan 1 2014 2:43 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
Advertisement
Advertisement