రాజన్నా నిను మరువం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాల ప్రదాతగా వైఎస్సార్ పేదలు, బడుగుల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడుతూ ఆయా చోట్ల నివాళులర్పించారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, పోలూరి వెంకటరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు, రాతంశెట్టి
రామాంజనేయులు తదితరులు పాల్గొని కేక్‌కట్ చేశారు. వైఎస్సార్ ఆశయ సాధనకు పునరం
కితం కావాలని ప్రతిన బూనారు.
పట్నంబజారు(గుంటూరు): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు భారీ కేక్ కట్‌చేశారు. ఈ సంద ర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినా మహానేత వైఎస్సార్‌ను ఎవ్వరూ మరిచిపోలేరన్నారు.
పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రైతు రుణాలు మాఫీ చేసి వారి అన్ని విధాలా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ హయాంలో ఎటువంటి పన్నుల భారం మోపలేదని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జనరంజకపాలన అందించిన ఘతన ఆయనకే దక్కుతుందన్నారు. పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పూర్తి కావటానికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారన్నారు. వైఎస్ పాలనంలో రాష్ట్రం ప్రజలు సువర్ణయుగాన్ని చూశారన్నారు. పొన్నూరు నియోజకవర్గ సమస్వయకర్త రావి వెంకటరమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బాసటగా నిలిచి వారిని అన్ని విధాలా ఆదుకున్నారన్నారు గుడిసెలు లేని రాష్ట్రాన్ని చూద్దామని కలలు కన్న మహనీయుడు వైఎస్సార్ అన్నారు.
జిల్లా మహిళా అధ్యక్షురాలు దాది లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం పావలా వడ్డీరుణాలు అందించారన్నారు. పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, నాయకులు రాతంశెట్టి రామాంజనేయులు, వివిధ విభాగాల జిల్లా నాయకులు ఉప్పుటూరి నర్సిరెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి, మండేపూడి పురుషోత్తం, యరమాల విజయ్‌కిషోర్, ఆలా కిరణ్, రాచకొండ ముత్యాలరాజు, బండారు శ్రీనివాస్, భారతి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.