మధ్యంతర భృతిపై నివేదిక కోరాం: ఆనం
ఉద్యోగుల మధ్యంతర భృతి డిమాండ్‌పై వేతన సవరణ సంఘాన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా కోరినట్లు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. వేతన సంవరణ సంఘం నుంచి నివేదిక అందగానే ముఖ్యమంత్రి స్థాయిలో మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో రచ్చబండ నిర్వహిస్తామని మంత్రి ఆనం తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో రచ్చబండ ప్రారంభమయ్య అవకాశం ఉందన్నారు. రచ్చబండ సమైక్యవాదానికి వేదిక అని కొంతమంది విమర్శిస్తున్నారు గానీ, అది సరికాదని రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి చేస్తున్న క్షేత్రస్థాయి కసరత్తే రచ్చబండ అని ఆయన గుర్తుచేశారు.