మెట్రోకు భద్రతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : సీపీ
Published Wed, Jul 23 2014 8:59 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
హైదరాబాద్: మెట్రో భద్రత అంశాపై సీపీ మహేందర్‌రెడ్డికి ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. మెట్రో స్టేషన్లకు పోలీసులతో భద్రత కల్పించే విషయం పరిశీలిస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులకు తెలిపారు.
మెట్రోకు భద్రత అంశం ఎవరి పరిధికి వస్తుందనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని మహేందర్‌రెడ్డి అన్నారు. త్వరలోనే మెట్రో భద్రతపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. సీఐఎస్‌ఎఫ్ తరహాలో మన పోలీసులకు శిక్షణ ఇవ్వాలని చూస్తున్నామని తెలిపారు. మెట్రో స్టేషన్లలో సీసీటీవీలు, హెచ్చరిక వ్యవస్థలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Advertisement
Advertisement