ఫ్యాక్షనిస్టులకు ఓటుతో బుద్ధి చెప్పండి | We Must Vote That Give A Lesson To The Factionists | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షనిస్టులకు ఓటుతో బుద్ధి చెప్పండి

Published Thu, Mar 14 2019 12:54 PM | Last Updated on Thu, Mar 14 2019 2:06 PM

We Must Vote That Give A Lesson To The Factionists - Sakshi

మాట్లాడుతున్న సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి

సాక్షి,గుంతకల్లు టౌన్‌:మర్డర్లు నాకు కొత్త కాదు..మా కుటుంబానికి 70 ఏళ్ల ఫ్యాక్షన్‌ చరిత్ర ఉందంటూ గుంతకల్లు నియోజకవర్గం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా  బెదిరింపులకు ప్రజలెవ్వ రూ భయపడొద్దని వైఎస్సార్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి భాగ్యనగర్‌లో వెల్డింగ్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడా రు.

రెండు రోజుల కిందట టీడీపీ కార్యాల యం వద్ద ప్రజల్ని భయాందోళనకు గురిచేసే విధంగా కొట్రికె చేసిన వ్యా ఖ్యలను ఆ యన తీవ్రంగా ఖండించారు. ప్రశాంతతకు మారుపేరైన గుంతకల్లు నియోజకవర్గంలో ఇక్కడి ప్రజలు కష్టపడి పనిచేసుకునే మనస్తత్వం కలిగిన వారన్నారు. ప్రశాంతంగా ఉన్న గుంతకల్లులో వర్గవిభేధాలు సృష్టించి, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించే దిశగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. రెండేళ్ల కిందట ఆచారమ్మకొట్టాలలో టీడీపీ నాయకులు వందలాది మంది పేదల గుడిసెలను కబ్జాచేస్తున్నారన్నారు. ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచి వారి ఆస్తులను కాపాడిన తనకు దౌర్జన్యపరుడని నిందించడం బాధకరమన్నారు.

 మొన్నటికి మొన్న దంచెర్ల గ్రామంలో బోయ సామాజిక వర్గానికి మాజీ సర్పంచ్‌ అనంతయ్యను జేసీ పవన్‌రెడ్డి బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. మీ దౌర్జన్యాలకు, రౌడీయిజానికి బెదిరేవారు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాక్షనిస్టులు, రౌడీలకు నియోజకవర్గం ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. హిట్లర్‌లా నియంత పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు బుద్దిచెప్పి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిని గెలిపించాలన్నారు. పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, ఫ్లోర్‌లీడర్‌ ఫ్లయింగ్‌ మాబు, పట్టణ అధ్యక్షుడు సుంకప్ప, 30వ వార్డు ఇన్‌చార్జ్‌లు జేసీబీ చాంద్, యాకుబ్, వెల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement