
చంద్రబాబు
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తాము సమన్యాయం కావాలనే కోరామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. విభజనపై ఇరు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడాలని కోరినట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, అంతకు ముందు చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తే అనుకూలంగా ఓటేస్తారా? లేక వ్యతిరేకంగా ఓటేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన జవాబు దాటవేశారు.