equal justice
-
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
సమన్యాయ సంకటం
ధర్మం, న్యాయం వేరు... చట్టం వేరు. కాలాన్ని బట్టి సమాజం దృష్టి మారినంత వేగంగా చట్టం మారడం కష్టం. ఒకవేళ మార్చాలన్నా ఆ పని పాలకులదే తప్ప, న్యాయస్థానాల పరిధిలోది కాదు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చేందుకు నిరాకరిస్తూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం వెలువరించిన తీర్పు ఆ సంగతే తేల్చింది. ‘‘ఈ కోర్టు చట్టం చేయలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలను విశ్లేషించి, వ్యాఖ్యానించగలదు. అది అమలయ్యేలా చూడ గలదు’’ అని భారత ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహాలను అనుమతించాలంటే చట్టం చేయాల్సింది పార్లమెంటేననీ, అందుకు తగ్గట్టు ‘ప్రత్యేక వివాహ చట్టాన్ని’ (ఎస్ఎంఏ) సవరించే బాధ్యత పాలకులదేననీ అభిప్రాయపడింది. అయితే, ఎల్జీబీటీక్యూ సముదాయ సభ్యులకు కలసి జీవించే హక్కుందనీ, దాన్ని తమ తీర్పు తోసిపుచ్చడం లేదనీ స్పష్టతనిచ్చింది. స్వలింగుల పెళ్ళికి చట్టబద్ధత లభిస్తుందని గంపెడాశతో ఉన్న ఎల్జీబీటీక్యూ లకు ఇది అశనిపాతమే. హక్కులకై వారి పోరాటం మరింత సుదీర్ఘంగా సాగక తప్పదు. నిజానికి, స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 జూలైలో సుప్రీమ్ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇక తదుపరిగా స్వలింగ జంటల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుందని ఎల్జీబీటీక్యూ వర్గం భావించింది. అందుకు తగ్గట్లే ఆ గుర్తింపును కోరుతూ 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకొనే హక్కు, పాఠశాలల్లో పిల్లల తల్లితండ్రులుగా పేర్ల నమోదుకు అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే వీలు, బీమా లబ్ధి లాంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అంశంపై ఏప్రిల్‌లో పదిరోజులు ఏకబిగిన విచారణ జరిపి, మే 11న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం నాలుగు అంశాలపై వేర్వేరు తీర్పులిచ్చింది. స్వలింగ పెళ్ళిళ్ళ చట్టబద్ధత పార్లమెంట్ తేల్చాల్సిందేనంటూ ధర్మాసనం బంతిని కేంద్రం కోర్టులోకి వేసింది. పెళ్ళి చేసుకోవడాన్ని రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కుగా ఇవ్వలేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే, పిల్లల దత్తత సహా స్వలింగ సంపర్కుల ఇతర అంశాలపై అయిదుగురు జడ్జీల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. దాంతో, ధర్మాసనం 3–2 తేడాతో మెజారిటీ తీర్పునిచ్చింది. వివాహ వ్యవస్థ, స్వలింగ సంపర్కాలపై ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా 34 దేశాలు సమ లైంగిక వివాహాలను చట్టబద్ధం చేశాయి. వచ్చే ఏడాది నుంచి 35వ దేశంగా ఎస్తోనియాలోనూ అది చట్ట బద్ధం కానుంది. ఇవి కాక మరో 35 దేశాలు స్వలింగ సంపర్కులకు పెళ్ళి మినహా అనేక అంశాల్లో చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. అమెరికా అయితే సాధారణ వివాహ జంటలకిచ్చే ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ స్వలింగ జంటలకు సైతం 2015 నుంచి అందిస్తోంది. స్వలింగ సంపర్కం, లైంగిక తల విషయంలో ప్రపంచంలో మారుతున్న ఆలోచనా ధోరణులకు ఇది ప్రతీక. అందుకే, మన దగ్గరా ఇంత చర్చ జరిగింది. ఆ మాటకొస్తే, భిన్న లైంగికత అనేది అనాదిగా సమాజంలో ఉన్నదే. మన గ్రంథాల్లో ప్రస్తావించినదే. అందుకే, సాక్షాత్తూ సుప్రీమ్ ఛీఫ్ జస్టిస్ సైతం, ఇదేదో నగరాలకో, ఉన్నత వర్గాలకో పరిమితమైనదనే అపోహను విడనాడాలన్నారు. అందరి లానే వారికీ నాణ్యమైన జీవితాన్ని గడిపే హక్కుందని పేర్కొన్నారు. ఇది గమనంలోకి తీసుకోవాల్సిన అంశం. స్వలింగ జంటల వివాహాలకు పచ్చజెండా ఊపనప్పటికీ, భిన్నమైన లైంగికత గల ఈ సము దాయం దుర్విచక్షణ, ఎగతాళి, వేధింపుల పాలబడకుండా కాపాడాల్సిన అవసరం తప్పక ఉందని సుప్రీమ్ అభిప్రాయపడింది. అందుకు కేంద్రం, రాష్ట్రాలు తగు చర్యలు చేపట్టాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. మరోపక్క స్వలింగ సంబంధాల్లోని జంటలకున్న సమస్యలను పరిశీలించేందుకూ, వారికి దక్కాల్సిన హక్కులను చర్చించేందుకూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పెళ్ళికి చట్టబద్ధత దక్కలేదని నిరాశ కలిగినప్పటికీ, స్వలింగ జంటలకు ఒకింత ఊరటనిచ్చే విషయాలివి. అర్ధనారీశ్వర తత్వాన్ని అనాది నుంచి అర్థం చేసుకొంటూ వస్తున్న భారతీయ సమాజం భిన్న లైంగికతను ఘోరంగా, నేరంగా, నీచంగా చూడడం సరికాదు. ఆ సముదాయం సైతం మన లోని వారేనన్న భావన కలిగించాలి. దీనిపై ప్రజల్లో ప్రభుత్వం చైతన్యం పెంచాలి. శానస నిర్మాతలు లైంగికతలో అల్పసంఖ్యాక సముదాయమైన వీరికి అవసరమైన చట్టం చేయడంపై ఆలోచించాలి. భారతీయ సమాజంలో వైవాహిక, కుటుంబ వ్యవస్థలకు ప్రత్యేక స్థానమున్న మాట నిజం. అది అధిక సంఖ్యాకుల మనోభావాలు ముడిపడిన సున్నితమైన అంశమనేదీ కాదనలేం. స్వలింగ జంటల వివాహం, పిల్లల దత్తత, పెంపకం సంక్లిష్ట సమస్యలకు తెర తీస్తుందనే కేంద్ర ప్రభుత్వ భయమూ నిరాధారమని తోసిపుచ్చలేం. కానీ, ఈ పెళ్ళిళ్ళకు గుర్తింపు లేనందున పింఛన్, గ్రాట్యుటీ, వారసత్వ హక్కుల లాంటివి నిరాకరించడం ఎంత వరకు సబబు? మన దేశంలో 25 లక్షల మందే స్వలింగ సంపర్కులున్నారని ప్రభుత్వం లెక్క చెబుతోంది. కానీ, బురద జల్లుతారనే భయంతో బయటపడిన వారు అనేకులు గనక ఈ లెక్క ఎక్కువే అన్నది ఎల్జీబీటీక్యూ ఉద్యమకారుల మాట. సంఖ్య ఎంతైనప్పటికీ, దేశ పౌరులందరికీ సమాన హక్కులను రాజ్యాంగం ప్రసాదిస్తున్నప్పుడు, కేవలం లైంగికత కారణంగా కొందరిపై దుర్విచక్షణ చూపడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి, కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేయాలి. అందరూ సమానమే కానీ, కొందరు మాత్రం తక్కువ సమానమంటే ఒప్పుతుందా? -
ఎక్కువ మగాళ్లు తక్కువ సమానులు
పురుషుల మీద లోకానికి మరీ చిన్నచూపు. ‘సమ’న్యాయం వర్ధిల్లే ప్రజాస్వామిక సమాజాల్లోనైతే మరీనూ! ఇలాంటి ప్రజాస్వామిక సమాజాలు పురుషులను పురుషుల్లా బతకనివ్వవు. వీకర్సెక్స్ను వెనకేసుకు రావడానికి అక్కర్లేనన్ని చట్టాలు చేసిపారేసి, మగాళ్ల బతుకులను ముళ్లబాటగా మార్చేస్తాయి. మగ బతుకుల గురించి ప్రాపంచిక దృక్పథం వరకు పోవద్దు గానీ, మన దేశంలోని పరిస్థితులనే సింహావలోకనం చేసుకుంటే... ఎన్నని చెప్పగలం లెండి... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. చాలా ప్రజాస్వామిక దేశాల్లోలాగానే మన దేశంలోనూ రాజ్యాంగానిది ‘సమ’న్యాయ దృక్పథమే! దాని ప్రకారం పురుషులకూ సమాన హక్కులు పొందే వీలుందని విర్రవీగితే మాత్రం చట్టంతో చెలగాటమాడినట్లే! మన చట్టాల దృష్టిలో మహిళలు కాస్త ఎక్కువ సమానులు. అలాగని మన సమాజంలో పురుషులందరూ కూడా సర్వసమానులు కాదు. పురుషులలో కూడా కొందరు ఎక్కువ సమానులు ఉందురు. అట్టివారు సహజంగా చట్టాలకు చుట్టాలై ఉందురు. ప్రభుత్వాన్ని సైతం కనుసన్నలలో శాసించగల అర్థబలసంపన్నులు, బాలీవుడ్ కథానాయకాగ్రేసరులు, అధికార పార్టీలకు అనుంగు అస్మదీయులు వంటి వారు ఈ కోవలోకి వస్తారు. అయితే, మన సమాజంలో ఎలాంటి అర్థబలం, అంగబలం లేకుండా, సాదాసీదాగా దించినతల ఎత్తకుండా సంసారపక్షంగా బతుకుబండిని భారంగా లాగించే మగాళ్లే ఎక్కువ. సమాజంలో ఎలాంటి నేరాలు, ఘోరాలు జరిగినా, అలాంటి ఘోరనేరాలతో సంసారపక్షపు పురుషాధములకు ఎలాంటి సంబంధం లేకున్నా, మహిళా సమాజం నుంచి నిందలు, నిష్టూరాలు తప్పవు. ఎవడో ఒకడు... ఎక్కడో ఒకచోట... ఏదో ఒక ఏఅఘాయిత్యానికి తెగబడతాడు. ఇక అంతే! సమస్త మగజాతికి వ్యతిరేకంగా టీవీ చానెళ్లు, పత్రికల సాక్షిగా ‘నారీభేరి’ మోగుతుంది. ప్రమీలా రాజ్యానికి వెళ్లిన అర్జునుడికి ఆ రోజుల్లో కనుక రాజపూజితంగా గడిచిపోయింది గానీ, ఈ రోజుల్లో అయితేనా! పొరపాటున లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కి, ముఖం వాచేలా చీవాట్లు తినకుండా బయటపడమనండి చూద్దాం... ఫల్గుణుడి ప్రతాపమెంతో తెలుస్తుంది. -
అందరికీ న్యాయం.. అదే సమన్యాయం
సామాన్యునికి న్యాయశాస్త్రం నారికేళపాకం. అక్షరాస్యుడికి సైతం కొరకరాని కొయ్య. రాజ్యాంగంలోని ప్రవేశిక ద్వారా అందరికీ న్యాయం, సమానత్వం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అది జరగాలంటే ప్రజలకి కనీస హక్కులపై అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దానికోసమే నవంబర్ 9న న్యాయ, సాక్షరతా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎవరికోసమైతే రాజ్యాంగం రాయబడిందో వారికి ఆ రాజ్యాంగం ప్రసాదించిన కనీస హక్కులు తెలియజేయాలి. వాళ్లకు ఈ రాజ్యాంగం, ఈ చట్టాలు మనవి అనే విశ్వాసం కల్పించాలి. ఇక్కడ న్యాయ సాక్షరత అంటే ప్రజలకి కనీస హక్కులపై అవగాహన కల్పించడం, అందుకోసం పని చేస్తున్న వ్యవస్థల గురించి తెలియజెప్పడం, ఆ వ్యవస్థలని ఆశ్రయించే మార్గాల గురించి తెలియజెప్పడం. అందుబాటులో ఉన్న న్యాయవ్యవస్థ గురించి సమాచారాన్ని వ్యాప్తిచేయడం. ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి భయపడే కారణాలు రెండు. కాలాతీతమైన కేసులు, భరించలేని ఖర్చులు. కాలాతీతంగా నడుస్తున్న వ్యాజ్యాలు ప్రజలకు న్యాయవ్యవస్థమీద నమ్మకం సన్నగిల్లేలా చేస్తుంది. ఈ రెండు పరిష్కరించే దిశలో భాగంగా లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అనవసర కారణాలతో సాగుతున్న వ్యాజ్యాలను ఇరుపక్షాల ఆమోదంతో త్వరగా పరిష్కరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల కేసుల్ని ఈ విధంగా పరిష్కరించి ప్రజల సమయాన్ని, వ్యయాన్ని కాపాడగలిగారు. ముఖ్యంగా న్యాయ అవగాహన ప్రజల్లో కలగడానికి భాష కీలకమైంది. దీనికోసం అన్ని చట్టాలను అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలి. సామాన్యులకు అర్థమయ్యే దిశలో వాటిని అనువదిస్తే తద్వారా న్యాయవ్యవస్థ ఫలాలు అందరికీ అందుతాయి. ఎందుకంటే భాష అవరోధంగా ఉండడం వలన ప్రజలకు దీనిపై అవగాహనకి అవరోధం ఏర్పడుతుంది. కోర్టులను ఆశ్రయించడం, ప్రజలకు దండగమారి వ్యవహారంగా మారింది. గెలిచినవాడికి, ఓడినవాడికి తేడాలేని పరిస్థితి. శ్రీశ్రీ అన్నట్లు న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేగాని, గెలిచేదంతా న్యాయం కాదు. కోర్టులో కేసు గెలిచినా, గెలిచామన్న తృప్తి మిగలడం లేదు. దీనికి కారణం కాలాతీతమైన తీర్పులు, గెలుపుకి, ఓటమికి మధ్య తేడా లేకుండా చేస్తున్నాయి. ఆదేశిక సూత్రాలలో భాగమైన 39(ఏ) అధికరణ న్యాయ సహాయం అందరికి అందుబాటులోకి రావాలని ఆర్థిక దుస్థితి వల్ల కాని, మరే ఇతర కారణాల వల్ల గాని న్యాయాన్ని పొందే అవకాశం కొందరికే పరిమితం కాకుండా ఉండాలని ఆ అధికరణ చెపుతోంది. దేశంలో పేదరిక శాతం ఎంత ఉన్నప్పటికీ మధ్యతరగతి వారికి కూడా న్యాయ స్థానాలను ఆశ్రయించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ఇందుకోసం 1976లో భారత రాజ్యాంగానికి అధికరణ 39(ఏ) జతచేసి అవసరమైన వారికి ఉచిత న్యాయం అందించటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. దీని కోసం చట్టాన్ని కూడా రూపొందించారు. అదే న్యాయసేవల అధికారిక చట్టం ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం ద్వారా మహిళలు, పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పాదాయ వర్గాలవారు, మత హింస బాధితులు, కులహింస బాధితులు ఈ చట్టం ద్వారా న్యాయం పొందటానికి అర్హులు. న్యాయవ్యవస్థ ఫలాలు అందరికీ అందినప్పుడే సామాన్యులకి వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసే ఏ వ్యవస్థకైనా ప్రజల ఆమోదముద్ర ఎప్పుడూ ఉంటుంది. ఈ దిశలో న్యాయవ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఫలితాలు ఆశించిన మేర సిద్ధిస్తాయి. ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలే పాలకులు. వాళ్ల నిరంతర అప్రమత్తతే వ్యవస్థని కాపాడుతుంది. అలా అప్రమత్తంగా ఉండాలంటే ప్రజలు చైతన్యవంతులై ఉండాలి. చైతన్యం రావాలంటే వాళ్లకి చట్టాలపై, రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. తెలుసుకోవడం సామాజిక బాధ్యత. అలా తెలుసుకుంటేనే దోపిడీ ఉండదు. హక్కుల ఉల్లంఘన ఉండదు. ఈ బాధ్యతని కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రజలందరూ గుర్తిస్తే తమనుతామే పాలించుకుంటున్నామన్న భావనకు సార్థకత ఉంటుంది. (నేడు న్యాయ, సాక్షరతా దినోత్సవం సందర్భంగా) సి.హెచ్.పుల్లారెడ్డి ,వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, కె.వి. రంగారెడ్డి న్యాయ కళాశాల, హైదరాబాద్ -
భార్యలపై అత్యాచారాలను అడ్డుకోండి: కోర్టు
వైవాహిక అత్యాచార బాధితులు కూడా అందరిలాంటివాళ్లేనని, వాళ్లను కూడా ఇతర బాధితులతో సమానంగానే చూడాలని ఢిల్లీ కోర్టు తెలిపింది. గర్భిణి అయిన తన భార్యపై అత్యాచారం చేసి కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. వైవాహిక అత్యాచార కేసులు నానాటికీ పెరిగిపోతుండటంతో చట్టం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని, భార్య అయినంత మాత్రాన ఎలా పడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో బాధితులకు ప్రభుత్వ సాయం కూడా ఏమీ అందడం లేదని గుర్తుచేసింది. ఢిల్లీలోని కేశవపురం ప్రాంతానికి చెందిన బాధితురాలి సంరక్షణ బాధ్యతలను ఢిల్లీ సర్కారు చేపట్టాలని అదనపు సెషన్స్ జడ్జి కామినీ లావూ ఆదేశించారు. తాను గర్భిణి అయినా.. తన భర్త తాగొచ్చి ప్రతిరోజూ బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కేసు పెట్టింది. కేవలం భార్య అయినందుకు అతడు పెట్టే ఆంక్షలను భరించాల్సిన అవసరం ఆమెకు లేదని జడ్జి అన్నారు. అతడి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అందువల్ల అతడికి బెయిల్ ఇవ్వకూడదని తెలిపారు. శృంగారం విషయంలో తన ఇష్టం వచ్చినట్లు తొమ్మిదేళ్ల కొడుకుకు చెప్పి, అతడి మనసును కూడా పాడుచేశాడని ఆమె అన్నారు. -
'సమన్యాయమంటే చిరంజీవికి అర్థం కాలేదు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యం ఉండాలని ఏనాడో చెప్పానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు ప్రాంతాల మధ్య విస్తృత చర్చలు జరపాలని సూచించినట్టు చెప్పారు. రెండు ప్రాంతాల్లో లబ్దికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. తాను సమన్యాయం అంటే కొందరు పెద్దలు మానవత్వం లేకుండా మాట్లాడారని వాపోయారు. సమన్యాయం ఏంటో చిరంజీవికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. విభజన ప్రక్రియ ప్రజాస్వామ్య పరిధిలో జరగలేదని విమర్శించారు. విభజనకు తాము వ్యతిరేకంగా కాదని, విభజన జరిగిన తీరును తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. రూ. 17 వేల కోట్ల రెవెన్యు లోటున్న ప్రాంతాన్ని ఏవిధంగా ఆదుకుంటారనే దానిపై స్పష్టత లోపించిందన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మించడం అంటే భవనం నిర్మించడం కాదని, దానికి రూ.4లక్షల కోట్లు కావాలన్నారు. విద్య, వైద్య, ఆర్థిక వనరుల కల్పన సంస్థల నిర్మాణం జరగాలన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ నేడో, రేపో విలీనమవుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. -
సమన్యాయం కోరాం:చంద్రబాబు
-
2008లో ఇచ్చిన లేఖలో సమన్యాయం కోరాం:చంద్రబాబు
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తాము సమన్యాయం కావాలనే కోరామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. విభజనపై ఇరు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడాలని కోరినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అంతకు ముందు చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తే అనుకూలంగా ఓటేస్తారా? లేక వ్యతిరేకంగా ఓటేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన జవాబు దాటవేశారు. -
సమన్యాయం కోసం సమర దీక్ష