'అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తాం' | we will meet governor due to assembly prorough, says D.Sridhar babu | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తాం'

Published Sat, Nov 23 2013 2:04 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తాం' - Sakshi

'అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తాం'

అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దని గవర్నర్ నర్శింహం, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్లను కలసి విజ్ఞప్తి చేస్తామని శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం హైదరాబాద్లో శ్రీధర్బాబు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తే పలు అనుమానాలకు తావిస్తుందని అభిప్రాయపడ్డారు.

 

డిసెంబర్ 25లోపు అసెంబ్లీ సమావేశపరచవలసి ఉన్నందున అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం . ఎన్ఆర్ఐ వెబ్ పోర్టల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఐలు తమ వివరాలను అందులో నమోదు చేసుకోవాలని సూచించారు కొత్తగా విదేశాలకు వెళ్లే వారు... ఏ దేశం వెళ్తున్నారు, జాబ్ తదితర వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement