D.Sridhar babu
-
అందరికీ ఆరోగ్యశ్రీ!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేస్తామంటూ ఎన్నికల హామీని గుప్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) యోచిస్తోంది. అందరికీ నాణ్యమైన విద్యతోపాటు కొత్త రాష్ట్రంలో సరికొత్త హామీలతో ప్రజలను ఆకట్టుకునేలా పలు ఎన్నికల తాయిలాలను చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. మూడురోజులుగా ఆయా అంశాలపై కసరత్తు చేస్తున్న టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు, కోచైర్మన్ మల్లు భట్టివిక్రమార్కలు ఈ మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, ప్రజా సంఘాలతోపాటు విద్యావేత్తలు, మేధావుల సలహాలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆదివారం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో కన్వీనర్ దేవీప్రసాద్, తదితరులతో ఓ హోటల్లో శ్రీధర్‌బాబు, భట్టి సమావేశమయ్యారు. అనంతరం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాయకులతోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం నేపథ్యంలో ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరుతో ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తున్నామని, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. జిల్లాకో అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలి ప్రతి జిల్లా కేంద్రంలోనూ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీని కోరినట్లు కోదండరాం తె లిపారు. అమరవీరుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్ లేదా ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కేసులను ఎత్తివేయాలని, ఉద్యమంలో వ్యక్తమైన డిమాండ్లను మేనిఫెస్టో రూపంలో అన్ని రాజకీయ పార్టీలకూ అందించనున్నట్లు తెలిపారు. -
'బంగారు తెలంగాణ సాధనే ఎజెండాగా మేనిఫెస్టో'
రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అందరికి ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో రూపొందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, కో చైర్మన్ భట్టివిక్రమార్కలు వెల్లడించారు. శుక్రవారం వారు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... సామాజిక న్యాయం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసేలా విజన్ డాక్యుమెంట్‌గా ఆ మేనిఫెస్టో ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రముఖులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే... ప్రగతిశీల తెలంగాణ, బంగారు తెలంగాణ సాధన ఎజెండాగా... మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. అందుకోసం తెలంగాణ కాంగ్రెస్ వెబ్సైట్ ఏర్పాటు చేసి అన్ని రంగాలవారి సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఆ మేనిఫెస్టో అందరికి ఆచరణ, ఆమోద యోగ్యంగా ఉంటుందని అన్నారు. -
కష్టానికి ప్రతిఫలమేదీ?
రాయవరం, న్యూస్‌లైన్ : అసలే అరకొర జీతాలు..అవీ నెలల తరబడి అందడం లేదు.... కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలీని దిక్కుతోచని స్థితి... ఎప్పటికైనా తమ ఉద్యోగం క్రమబద్ధీకరించకపోతారా అనే ఆశతోనే కాంట్రాక్టు అధ్యాపకులు కష్టాలను ఎదుర్కొంటూ నెట్టుకొస్తున్నారు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలమందక వారు విలవిల్లాడుతున్నారు. వారి ఆకలి కేకలు ప్రభుత్వం చెవికెక్కడం లేదు. జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారిలో 140 మంది ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు. అలాగే జిల్లాలోని 18 డిగ్రీ కాలేజీల్లో 160 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులకు నెలకు రూ. 18వేల జీతం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు జీతాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాగే డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ. 20,700 వంతున చెల్లిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ నెల నుంచి నేటి వరకు తొమ్మిది నెలలుగా ఒక్క నెలకు కూడా వారికి జీతం చెల్లించలేదు. దాంతో అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. 4271 జీవో అమలై ఉంటే... మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4271జీవోను విడుదల చేశారు. ప్రతీ నెలా ఐదో తేదీ లోగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలనేది జీవో సారాంశం. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకపోవడంతో తమకు కష్టాలు తప్పడం లేదని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. నెరవేరని ప్రభుత్వ హామీ.. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎన్నో పోరాటాలు చేశారు. దీనిపై 2012లో కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మెచేశారు. దాంతో ప్రభుత్వం 2012 ఫిబ్రవరి 13న మంత్రుల సబ్‌కమిటీ వేసింది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కె.పార్థసారథి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళి, సాకే శైలజానాథ్, డి.శ్రీధర్‌బాబు అందులో సభ్యులు. నెల రోజుల్లో సమస్యను పరి ష్కరిస్తామని కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఆ కమిటీ హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేసింది.. అయితే ఇంతవరకూ ఆ హామీ అమలుకు నోచుకోనేలేదు. -
'అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తాం'
అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దని గవర్నర్ నర్శింహం, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లను కలసి విజ్ఞప్తి చేస్తామని శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తే పలు అనుమానాలకు తావిస్తుందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 25లోపు అసెంబ్లీ సమావేశపరచవలసి ఉన్నందున అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం . ఎన్ఆర్ఐ వెబ్ పోర్టల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఐలు తమ వివరాలను అందులో నమోదు చేసుకోవాలని సూచించారు కొత్తగా విదేశాలకు వెళ్లే వారు... ఏ దేశం వెళ్తున్నారు, జాబ్ తదితర వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.