రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అందరికి ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో రూపొందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, కో చైర్మన్ భట్టివిక్రమార్కలు వెల్లడించారు. శుక్రవారం వారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... సామాజిక న్యాయం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసేలా విజన్ డాక్యుమెంట్గా ఆ మేనిఫెస్టో ఉంటుందన్నారు.
అన్ని వర్గాల ప్రముఖులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే... ప్రగతిశీల తెలంగాణ, బంగారు తెలంగాణ సాధన ఎజెండాగా... మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. అందుకోసం తెలంగాణ కాంగ్రెస్ వెబ్సైట్ ఏర్పాటు చేసి అన్ని రంగాలవారి సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఆ మేనిఫెస్టో అందరికి ఆచరణ, ఆమోద యోగ్యంగా ఉంటుందని అన్నారు.