టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అంగీకరించం: జేఏసీ
Published Wed, Aug 6 2014 7:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
హైదరాబాద్: టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అంగీకరించమని ఏపీ ఉపాధ్యాయసంఘాల జేఏసీ తెలిపింది. ప్రభుత్వం మమ్మల్ని దొంగల్లా చూస్తే సహించమని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ సంఘాల ఆమోదం లేకున్నా హేతుబద్ధీకరణ చేపట్టడానికి వీళ్లేదని ఉపాధ్యాయ జేఏసీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులపై నియంత్రణలు విధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా ఒక్కో చర్య మొదలుపెడుతోందని జేఏసీ ఆరోపించింది. పదివేల మందికి పైగా టీచర్లను హేతుబద్ధీకరించాలని (రేషనలైజేషన్) ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది.
Advertisement