సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘మూడు రోజులుగా జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలకు నష్టపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటాం. వరద బాధితులకు అండగా ఉంటాం. వర్షాలకు ఇళ్లు కూలిపోయిన వారందరికీ కొత్త ఇళ్లను మంజూరు చేస్తాం. జిల్లాలో వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలు ప్రాథమికమైనవే. నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉం టుంది..’ అని గృహ నిర్మాణ శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. వర్షాల పరిస్థితి, జరిగిన నష్టం, ఇప్పటి దాకా చేపట్టిన సహాయక చర్యలు తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి వివరాలు తెలియజేశారు. ‘ఎడతెరిపిలేని వర్షాలు పడడం చాలా బాధాకరం. పంట నష్టానికి సంబంధించి సరైన అంచనాలు వేయమన్నాం. అత్యవసర పరిస్థితితుల్లో సేవలు వినియోగించుకునేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం..’ అని తెలిపారు.
పభుత్వ నిబంధనల మేరకు పంట నష్టపోయిన రైతులందరికీ సాయం అందిస్తామని, హెక్టారుకు రూ.10వేల చొప్పున అన్ని రకాల పంటలకూ సాయం చెల్లిస్తామని పేర్కొన్నారు. చింతపల్లిలో గోడకూలి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్‌కు తరలించామని చెప్పారు. భారీ వర్షాలకు 22 మండలాల్లోని 465 గ్రామాలు బాగా ప్రభావితమయ్యాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలకు ఇళ్లు కూలిన ప్రతిఒక్కరికీ కొత్త ఇంటిని మంజూరు చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వర్షాలు తగ్గి, పరిస్థితి అదుపులోకి వ చ్చేవరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కొనసాగుతాయన్నారు. విలేకరుల సమావేశంలో కలెక్టర్ చిరంజీవులు, అధికారులు పాల్గొన్నారు.
వరద బాధితులకు అండగా నిలుస్తాం
Published Sat, Oct 26 2013 5:11 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement