‘అనంత’ రైతులపై వాతావ‘రణ’ం రణభేరి మోగిస్తోంది. అంతుచిక్కని వాతారణ పరిస్థితుల నడుమ అన్నదాతలు అవస్థల సాగు చేస్తున్నారు. వర్షం జాడ లేకపోవడంతో ఖరీఫ్ కల్లోలమయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లా రైతులు మరోసారి కరువురక్కసికి సమిధలయ్యే ప్రమాదం పొంచివుంది. 9.33 లక్షల హెక్టార్లు సాగు కావాల్సిన ఖరీఫ్‌కు కీలక సమయంలో వర్షాలు మొహం చాటేశాయి. వారం పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్‌పై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే.
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అవసరం లేని సమయంలో భారీ వర్షాలతో మురిపించిన వరుణుడు అత్యంత కీలకమైన సమయంలో శీతకన్ను వేశాడు. ఏప్రిల్, మే నెలల్లో సాధారణ వర్షపా తం 52.4 మి.మీ కాగా ఏకంగా రెట్టిం పు స్థాయిలో 116.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఖరీఫ్ ప్రారంభమైన జూన్ ఒకటో తేదీ కూడా 17.1 మి.మీ వర్షపాతం మంచి తొలకర్లతో రైతుల్లో ఆశలు రేకెత్తించాడు.
నైరుతీ ప్రవేశించిన నాటి నుంచి ఒక్క పదును వర్షం కూడా పడకపోవడంతో రైతుల ఆశలు క్రమంగా ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. కీలకమైన జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ. కాగా 11 రోజులైనా ఒక మి.మీ వర్షపాతం నమోదు కాలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు హోరెత్తిస్తున్నాయి. ఎండలు కూడా రెండు రోజులు తగ్గడం మరో రెండు రోజులు పెరగడం ఇలా అంతుచిక్కని వాతావరణ పరిస్థితుల నడుము వరుణుడు రైతన్నపై కక్ష పూనాడు.
వేసిన పంటలు ఎండుముఖం
జూన్‌లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావడంతో కొందరు రైతులు ఖరీఫ్ పంటల సాగు చేశారు. సుమారు 40 మండలాల్లో 2 నుంచి 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం తదితర పంటలు విత్తుకున్నారు. తరువాత కనీసం తుంపర వర్షం కూడా పడకపోవడంతో ఇపుడు వాటి పరిస్థితి దయనీయంగా తయారైంది. లేత పైర్లు 20 నుంచి 30 రోజుల వరకు బెట్టకు గురికావడంతో చాలా వరకు ఎండుముఖం పట్టాయి. మరో వారం పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. గతేడాది కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్లే ఖరీఫ్ పంటలు రైతులకు రూ.5 వేల కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చాయి.
పొలాన్ని బీడుగా పెట్టాం...
ప్రతి సంవత్సరం దాదాపు 10 ఎకరాలు వేరుశనగ సాగు చేసే వాళ్లం. ప్రస్తు తం రాయితీ వేరుశగ లభించకపోవడంతో కేవలం రెండు ఎకరాలు మా త్రమే సాగుచేశాం. ప్రభుత్వం వేరుశగ విత్తన కాయల కోసం ముందస్తు చర్యలు చేపట్టక పోవడంతో కష్టాలు తప్పలేదు.
- భారతి, పూలకుంట
వారం రోజుల్లో వర్షం వస్తే సాగు ..
3 ఎకరాల్లో వేరుశగ సాగుకోసం విత్తనాలు సిద్దం చేసుకుని వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. వారం రో జుల్లో వర్షం వస్తే వేరుశగ సాగు చేయాటానికి వీలుంటుంది. తర్వాత వచ్చి నా ప్రయోజనం ఉండదు. మరోసారి కరువు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
- రైతు చలపతి, చియ్యేడు
వాతావరణం
Published Sun, Jul 12 2015 2:07 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement