మరోవైపు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఒడిశాకు ఈశాన్యంగా జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం మనకు లేకపోయినా ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశాలపై ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఛత్తీస్‌ఘడ్ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తాంధ్ర, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 50 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వాయుగుండంగా మారిన అల్పపీడనం
Published Tue, Jul 22 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement