శ్రీకాకుళం అర్బన్: వెబ్‌ల్యాండ్ విధానంతో రైతుల భూములకు ముప్పు పొంచి ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చాలా మంది భూముల మ్యుటేషన్ పూర్తికాలేదని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు సరిగా లేవని తెలిపారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల ప్ర కారం భూముల వివరాలు సరిగా ఉన్నదీ, లేనిదీ సరిచూసుకోవాలని రైతులకు సూచించారు.
వెబ్‌ల్యాండ్ జీవో ప్రమాదకరమైనదని రైతు సంఘాలు, వెనుకబడిన తరగతుల సంఘాలు, మేధావులు పేర్కొంటున్నా ప్రభుత్వం అమలుచేయడం దురదృష్టకరమని తెలిపారు. జీవో సారాంశాన్ని పల్లెవాసులకు వివరించి వారికి భూమి హక్కు పొందే విధానాన్ని ముందుగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జూలై 1 నుంచి అమలులోకి రానున్న వెబ్‌ల్యాండ్ విధానాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వెబ్‌ల్యాండ్‌తో రైతుల భూములకు ముప్పు
Published Wed, Jun 29 2016 11:49 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement