పెద్దల సభలో స్థానం అంటే ఒక గౌరవం. అరుదైన ఈ అవకాశం కోసం ‘రాజీ’కీయాలు, పైరవీలు పనిచేసినా సీటు దక్కించుకున్న వారికి మాత్రం అది ఎంతో ప్రత్యేకతే. అలాంటి ఘనత కాంగ్రెస్ పాలనలో పాలమూరుకు పట్టలేదంటే ఆశ్చర్యమే అయినా వాస్తవమే. ఈ మారు కూడా రిక్తహస్తం ఎదురవ్వడం జిల్లావాసులు కలవరపడుతున్నారు. గుర్తింపు లేని ధోరణిగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తాజాగా ముగిసిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఘట్టంలో జిల్లా నేతలెవరికీ పెద్దల సభకు ఎన్నికయ్యే అవకాశం లేదని నామినేషన్ల పర్వంతో తేటతెల్లమైంది.
ఆరు దశాబ్దాలకు పైగా జిల్లా నుంచి ఉ ద్దండులైన రాజకీయవేత్తలు లోక్‌సభ, శాసన సభ, శాసన మండలి వంటి చట్ట సభలకు ప్రాతినిధ్యం వ హించారు. పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు మా త్రం జిల్లా నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య రెండంకెలకు చేరలేదు. ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే ఈ సభకు జిల్లా నుంచి పెద్దల సభలో అడుగుపెట్టడం గమనార్హం. ఇలా 1978 నుంచి 2008 వరకు మాత్రమే రాజ్యసభలో జిల్లాకు సీటు దక్కింది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటి వరకు జిల్లాకు చెందిన ఒక్కరు కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన ఏడుగురిలో ఆరుగురికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చింది. రాజ్యసభలో విపక్ష నేతగా వ్యవహరించిన ఎస్.జైపాల్‌రెడ్డి జనతాదళ్ పక్షాన అప్పట్లో ఎన్నికయ్యారు. ఆయనతో పాటు, ఖలీలుర్ రహ్మాన్‌లు కాంగ్రెస్‌లో కీలక పదవులు పొందినా రాజ్యసభకు మాత్రం ఇతర పార్టీల నుంచి ఎన్నికయ్యారు.
42లక్షలకు పైగా జనాభా, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా నుంచి రాజ్యసభలో దక్కిన ప్రాతినిధ్యం అరకొరగానే వుంది. ప్రస్తుత ద్వైవార్షిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు అవకాశం కోసం ఆశించినా దక్కలేదు. సుదీర్ఘ కాలంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల ఎంపికలో జిల్లాకు ప్రాధాన్యమివ్వకపోవడంపై నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
ప్చ్...‘పెద్ద’లే లేరా?
Published Thu, Jan 30 2014 3:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement