మహబూబ్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించగా సార్వత్రిక పోటీలో కారు దూసుకుపోయింది. 7 అసెంబ్లీ స్థానాలకు గెల్చుకుని కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేసింది. కాంగ్రెస్ 5 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది.
మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి గెల్చుకున్నారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కేంద్ర ఎస్. జైపాల్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు.
నాగర్కర్నూలులో టీఆర్ఎస్ అభ్యర్థి మందా జగన్నాథం విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య, టీడీపీ అభ్యర్థి బక్కా నర్సింహులును ఓడించారు.
1. కొడంగల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కె.రేవంత్‌రెడ్డి గెలిచారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విఠల్రావుపై 14400 ఓట్ల తేడాతో నెగ్గారు. టీఆర్ఎస్ అభ్యర్థి గురునాథ్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
2. మహబూబ్నగర్లో టీఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డిపై 2803 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు
3. నాగర్ కర్నూల్లో నాగం జనార్దన రెడ్డి కుమారుడు నాగం శశిధర్‌రెడ్డికి చుక్కెదురైంది. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి చేతిలో 14435 ఓట్లతో ఓడిపోయారు.
4. గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి డి.కె.అరుణ విజయం సాధించారు టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డిపై 8422 ఓట్లతో ఆమె గెలుపొందారు.
5. నారాయణపేటలో టీడీపీ టీడీపీ అభ్యర్థి రాజేందర్రెడ్డి గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి కె. శివకుమార్ రెడ్డిపై 2600 ఓట్లతో విజయం సాధించారు.
6. జడ్చర్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సి.లక్ష్మారెడ్డి పాగా వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై 14435 ఓట్లతో ఓడించారు.
7. దేవరకద్రలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆలే వెంకటేశ్వరరెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బి.పవన్కుమార్ పై 12246 ఓట్లతో గెలిచారు.
8. మక్తల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కొత్తకోట దయాకర్రెడ్డిపై12500 ఓట్ల తేడాతో నెగ్గారు.
9. వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.నిరంజన్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి జి. చిన్నారెడ్డి గెలిచారు.
10. అలంపూర్ (ఎస్సీ)లో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి అబ్రహాంపై 4839 ఓట్లతేడాతో గెలిచారు.
11. అచ్చంపేట (ఎస్సీ)లో టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణపై 11354 ఓట్లతో గెలిచారు.
12. కల్వకుర్తిలో బీజేపీ అభ్యర్థి ఆచారిలపై కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి పైచేయి సాధించారు.
13 షాద్‌నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి వై.అంజయ్యయాదవ్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్.ప్రతాప్రెడ్డిని 17328 ఓట్లతో ఓడించారు.
14. కొల్లాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్రెడ్డిని 10498 ఓట్లతో ఓడించారు.
పాలమూరులో కారు జోరు
Published Fri, May 16 2014 11:18 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement