
ల్యాప్‌టాప్‌లో రాస్తున్న పద్దులు స్క్రీన్‌పై కనిపిస్తున్న దృశ్యం
నెల్లిమర్ల : ఇప్పటిదాకా ఏ ఫంక్షన్‌లో అయినా పుస్తకాల్లో పద్దులు రాయడం చూసాం. మహా అయితే కంప్యూటర్‌లో నమోదు చేయడం ఇటీవల అక్కడక్కడా కనిపిస్తోంది. తాజాగా నెల్లిమర్ల పట్టణం బయిరెడ్డి సూర్యనారాయణ మున్సిపల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఓ వ్యక్తి కుమార్తె ఆఫ్‌శారీ ఫంక్షన్లో ఏకంగా ల్యాప్‌టాప్‌లో పద్దులు రాయడం కనిపించింది. అంతేగాకుండా రాసిన పద్దు కరెక్టో కాదో తెలుసుకునేందుకు పక్కనే స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఇది చూసిన ఆహ్వానితులు టెక్నాలజీకి ముక్కున వేలేసుకున్నారు. వారెవ్వా...వాట్ ఏ టెక్నాలజీ అంటూ విస్తుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment