miracles
-
సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు. మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్‌లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. పాత సవాళ్లు వదిలేద్దాం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత సవాళ్లను ఇక వదిలేద్దామని, నూతన అవకాశాల నుంచి లబ్ధి పొందుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన రోజ్‌గార్ మేళానుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించాలని, కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందాలన్నదే తమ ఆశయమని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి జమ్మూకశ్మీర్‌ను ఉన్నత శిఖరాలను చేర్చుదామని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో ప్రస్తుత దశాబ్దం జమ్మూకశ్మీర్ చరిత్రలో చాలా ముఖ్యమైన దశాబ్దమని చెప్పారు. పాత సవాళ్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికై, రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువతకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తయారీ హబ్‌గా భారత్ వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్‌గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్‌సెట్, కొత్త వర్క్‌కల్చర్‌తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ దిశగా ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. -
Telangana: ఆకాశంలో అద్భుతం
ఖానాపూర్: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు సూర్యుడి చుట్టు ఇంద్రధనుస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది. జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు. కొందరు కళ్లద్దాల్లో, మరికొందరు సెల్ఫోన్లలో సూర్యుడి ఫొటో, వీడియోల్లో చిత్రీకరించారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. వాతావరణంలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడంతో ఈ తరహా వలయాలు ఏర్పడుతాయని మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాల సైన్స్ టీచర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. దీన్ని కెలడోస్కోప్ ఎఫెక్ట్ అంటారని పేర్కొన్నారు. చదవండి: (టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి) -
శంషాబాద్‌లో కోట మైసమ్మ ఆలయంలో విచిత్రం
-
వారెవ్వా...వాట్ ఏ టెక్నాలజీ...!
నెల్లిమర్ల : ఇప్పటిదాకా ఏ ఫంక్షన్లో అయినా పుస్తకాల్లో పద్దులు రాయడం చూసాం. మహా అయితే కంప్యూటర్లో నమోదు చేయడం ఇటీవల అక్కడక్కడా కనిపిస్తోంది. తాజాగా నెల్లిమర్ల పట్టణం బయిరెడ్డి సూర్యనారాయణ మున్సిపల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఓ వ్యక్తి కుమార్తె ఆఫ్‌శారీ ఫంక్షన్లో ఏకంగా ల్యాప్‌టాప్‌లో పద్దులు రాయడం కనిపించింది. అంతేగాకుండా రాసిన పద్దు కరెక్టో కాదో తెలుసుకునేందుకు పక్కనే స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఇది చూసిన ఆహ్వానితులు టెక్నాలజీకి ముక్కున వేలేసుకున్నారు. వారెవ్వా...వాట్ ఏ టెక్నాలజీ అంటూ విస్తుపోయారు. -
74 ఏళ్ల కుర్రాడు
74 ఏళ్ల వయసులో చాలామందికి నడవడమే కష్టం. ఓ మూలన కూర్చొని కృష్ణా... రామా అంటూ శేష జీవితం గడిపేస్తుంటారు. సొంతంగా తన పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే నడవడానికే కష్టమైన ఈ వయసులో... బెజవాడకు చెందిన ఓ వృద్ధుడు అంతర్జాతీయ యవనికపై అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బద్ధకంగా కదిలే టీనేజ్ కుర్రాళ్లకు కనువిప్పు కలిగేలా అథ్లెటిక్స్‌లో అచ్చెరువొందే విజయాలు సాధిస్తున్నాడు. మైదానంలో ఆయన్ని చూస్తే... పరుగెత్తుతున్న కుర్రాడు కూడా ఓ క్షణం ఆగిపోతాడు. అథ్లెట్లయితే ఆ పరుగు పూర్తయ్యే వరకు ఆయన్నే అనుసరిస్తారు. జాగింగ్ చేస్తున్న వారు కూడా ఆ క్షణం పరుగెత్తేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే 74 ఏళ్ల ఎస్. పద్మనాభన్ ప్రాక్టీస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. లేటు వయసు (54 ఏళ్లలో)లో అంతర్జాతీయ యవనికపైకి దూసుకొచ్చినా ఘాటుగా తన సత్తాను చూపిస్తున్నారు. వెటరన్ (70+) విభాగంలో ఆసియా స్థాయిలో ఇప్పటికే 17 పతకాలు సొంతం చేసుకున్నారు. ఇందులో 3 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. 8వ ఆసియా చాంపియన్‌షిప్‌తో ప్రారంభమైన ఈయన జైత్రయాత్ర ఇంకా కొనసాగుతోంది. మధ్యలో ఒకటి, రెండు (15, 16వ చాంపియన్‌షిప్) మిస్ అయినా ఎక్కువ ఈవెంట్లలో తన లక్ష్యాన్ని సాధించారు. 200 మీటర్లు (30 సెకన్లు), 300 మీటర్ల హర్డిల్స్ (50 సెకన్లు), 80 మీటర్ల హర్డిల్స్ (16.1 సెకన్లు)లలో బరిలోకి దిగే ఆయన 4ఁ100, 4ఁ400 రిలేలో పాల్గొనే భారత్ జట్టుకు ఫినిషింగ్ టచ్‌నూ ఇస్తారు. ఇంతకీ ఎవరితను? విజయవాడకు చెందిన పద్మనాభన్... ఏపీఎస్ఆర్టీసీలో డివిజనల్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. పిల్లలంతా వాళ్ల... వాళ్ల కెరీర్లో స్థిరపడిన తర్వాత ‘ఆట’ మొదలుపెట్టారు.. చిన్నప్పుడు క్రికెట్, ఫుట్‌బాల్ ఆటల్లో ప్రావీణ్యం ఉండటం, శరీరం కూడా అనువుగా ఉండటంతో 1990లో అథ్లెటిక్స్‌పై దృష్టిపెట్టారు. అలా మెల్లగా మొదలైన కసరత్తులు ఈవెంట్లలో పతకాలు సాధించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే మూడు అంశాలు ‘అంకితభావం, ఆహారం, క్రమశిక్షణ’ గురించి చెబుతారు. జపాన్ను కొట్టాలి! చైనా, కొరియాలపై సులువుగా గెలిచినా... జపాన్ను మాత్రం ఓడించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసే పద్మనాభన్ ఆ లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించనంటారు. జూలైలో జపాన్‌లో జరగబోయే 18వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఈ టోర్నీకి అర్హత సాధించాలంటే ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు కోయంబత్తూరులో జరిగే జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో సత్తా చాటాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ‘ఫీల్డ్‌లోకి ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా... ఏం చేశామన్నదే ముఖ్యం’ ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను పద్మనాభన్ తన నిజ జీవితంలో చేసి చూపిస్తున్నారు. ఏదేమైనా మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ అథ్లెట్ తాతయ్యకు ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే. - ఆలూరి రాజ్‌కుమార్, (సాక్షి స్పోర్ట్స్, విజయవాడ) హైదరాబాద్‌లో ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ ఇంజ నీర్‌గా పనిచేస్తున్న సమయంలో 1988లో లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన జాతీయ వెటరన్ అథ్లెటిక్ మీట్ చూశాను. అప్పటి నుంచి అథ్లెటిక్స్ మీద ఆసక్తి పెరిగింది. 1990లో తొలిసారి మలేసియాలో మీట్‌కు వెళ్లాను. అందులో నాలుగో స్థానం వచ్చింది. 1992 నుంచి పాల్గొన్న ప్రతి మీట్లో ఏదో ఒక పతకం సాధించా. ఆర్టీసీలో వర్క్స్ మేనేజర్‌గా పనిచేసిన రాజగోపాల్ గారు నా గురువు. వర్షం వచ్చినా, వాతావరణం ఎలా ఉన్నా ప్రాక్టీస్ ఆపకూడదు. మనం పాల్గొనే పోటీల్లో ఉత్తమ టైమింగ్ ఎంత? మన టైమింగ్ ఎంత? ఈ రెండు అంశాలను బేరీజు వేసుకుని ప్రాక్టీస్ చేయాలి. నాలాంటి చిన్న పెన్షనర్లకు విదేశాలకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న పనే. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా.. మక్కువను చంపుకోలేం కదా. - పద్మనాభన్ సాధించిన ఘనతలు 1994 జకర్తాలో జరిగిన 8వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజతం 1996 సియోల్‌లో జరిగిన 9వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం, కాంస్యం. 1998 ఒకినోవాలో జరిగిన 10వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, కాంస్యం. 2000 బెంగళూరులో జరిగిన 11వ ఆసియా వెటరన్ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు. 2002 చైనాలో జరిగిన 12వ ఆసియా వెటరన్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం. 2004 బ్యాంకాక్‌లో జరిగిన 13వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం. 2006 బెంగళూరులో జరిగిన 14వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఒక రజతం. 2012 చైనాలో జరిగిన 17వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు. నాలుగు బిస్కెట్లు... తన ఫిట్‌నెస్‌కు మితాహారమే కారణమనే పద్మనాభన్... తన దినచర్యలో కూడా కచ్చితమైన నియమాలను పాటిస్తారు. ఉదయం కాఫీతో పాటు నాలుగు మ్యారీ గోల్డ్ బిస్కెట్లు తీసుకుంటారు. మధ్యాహ్నం కప్ రైస్, పప్పు, సాంబార్, కూరగాయలు, ఒక ఫ్రూట్‌ను లంచ్‌గా తీసుకుంటాడు. డిన్నర్లో కూడా వీటినే కొనసాగిస్తారు. అయితే ఎక్కడున్నా... వాతావరణం ఎలా ఉన్నా... రోజుకు గంటన్నర ప్రాక్టీస్ తప్పనిసరి. -
వివేకమే విజయసూత్రం
అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఎవరికీ తెలియదు. జరిగాక మాత్రం వాటిని సాధించిన వారి జీవితాలు పాఠాలు అవుతాయి. వారి ఆలోచనలు అపురూపం అనిపిస్తాయి. వారి మాటలు స్ఫూర్తిమంత్రాలవుతాయి. పుణెకి చెందిన ఫర్హద్ అసిద్వాలా విజయం కూడా అలాంటి ఓ అద్భుతమే! ‘‘నువ్వు వేసే తొలి అడుగే అత్యంత ముఖ్యమైన అంశం. తర్వాత నీ శ్రమే నిన్ను నడిపిస్తుంది, విజేతగా నిలుపుతుంది...’’. తను నమ్మే సూత్రం ఇదేనంటాడు ఫర్హద్. దీన్ని నమ్మి, ఆచరించి, విజయం సాధించాడు కాబట్టే అంత కచ్చితంగా చెబుతున్నాడు. పుణెలోని ఒక ప్రముఖ విద్యాసంస్థలో బిజినెస్ మేనే జ్మెంట్ కోర్సును చదువుతున్న ఫర్హద్ సాధించిన విజయం... బిజినెస్ ‘మేనేజ్మెంట్ గురూ’ లనే ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది సంవత్సరాల కిందట... ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్‌లు ఇంటింటికీ ప్రవేశించని, గ్రామీణ భారతానికి ఇంకా ఇంటర్నెట్తో పరిచయం లేని రోజుల్లో... పట్టణాల్లో కూడా అరుదుగా మాత్రమే ఇంటర్నెట్ కేఫ్‌లు కనిపించే సమయంలో ‘డొమైన్ రిజిస్ట్రేషన్’ బిజినెస్‌ను ప్రారంభించాడు ఫర్హద్. ఐటీ, ఇంటర్నెట్ ఆధారిత టెక్నికల్ కోర్సులు నేర్చుకొంటే మంచి ఉద్యోగం వస్తుంది అని ఎక్కువమంది యువతీయువకులు భావిస్తున్న ఆ రోజుల్లోవారందరికీ భిన్నంగా ఇంటర్నెట్ ఆధారంగా వ్యాపారం చేసేందుకు ప్లాన్ వేశాడు ఫర్హద్. ఇదే అతడు వేసిన తొలి అడుగు... వైవిధ్యమైన అడుగు. అప్పటికి ఫర్హద్ వయసు కేవలం 12 సంవత్సరాలు! తిరిగి చెల్లించే షరతులతో అమ్మానాన్నల దగ్గర ఆరు వందల రూపాయలు అప్పుగా తీసుకొని, ఒక డొమైన్‌నేమ్ రిజిస్టర్ చేయించుకొని, తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదట్లో డొమైన్ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్మాడు. తర్వాత ఇంటర్నెట్లో కమ్యూనిటీలు క్రియేట్ చేసి వాటిని అమ్మడం మొదలెట్టాడు. ఇలా వెబ్ ఆధారిత వ్యాపారంలో ఒక్కో మెట్టూ ఎదిగాడు. తెలివితేటలను మాత్రమే పెట్టుబడి పెట్టే వ్యాపారాలను చేశాడు. తను చేస్తున్న పనంతా వ్యవస్థీకృతంగా ఉండాలనే ఉద్దేశంతో ‘రాక్‌స్టా మీడియా’ అనే కంపెనీని స్థాపించాడు. అనేక మందికి ఉపాధి కల్పించాడు. అదృష్టం కోసం వెతుకులాడకుండా... వివేకమే విజయసూత్రంగా ఫర్హద్ చేసిన ఎనిమిదేళ్ల ప్రయాణం అతడిని అంతర్జాతీయ అవార్డులను అందుకొనే స్థాయికి చేర్చింది. ఒకవైపు చదువుతూనే వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇతడి బిజినెస్ ఐడియాలు సక్సెస్ కావడమే కాదు, ఆ సక్సెస్‌కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. సీఎన్ఎన్ ఐబీఎన్ దగ్గర నుంచి అనేక మీడియా సంస్థలు ఫర్హద్‌ను యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తించాయి. ప్రస్తుతం ఇండియాలోని టాప్ టెన్ యంగ్ బిజినెస్ మ్యాగ్నెట్లలో అతడూ ఒకడు! -
వదంతులతో మధ్యాహ్నం ముగ్గులు