వాట్సాప్లో థ్యాంక్స్ అంటూ రిప్లై.. బదిలీ | WhatsApp messege reply: ASI transferred in hindupur | Sakshi
Sakshi News home page

వాట్సాప్లో థ్యాంక్స్ అంటూ రిప్లై.. బదిలీ

Published Tue, Feb 3 2015 12:55 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

వాట్సాప్లో థ్యాంక్స్ అంటూ రిప్లై.. బదిలీ - Sakshi

వాట్సాప్లో థ్యాంక్స్ అంటూ రిప్లై.. బదిలీ

హిందూపురం : వాట్సాప్‌లో వచ్చిన ఓ ఫొటో చూసి అలవాటుగా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చిన ఏఎస్‌ఐ అనూహ్యంగా బదిలీకి గురైయ్యారు. వివరాల్లోకి వెళితే. గత నెల 28న అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల టీడీపీ నాయకుల సమావేశం రసాభాసా అయింది. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ వ్యవహార శైలిపై ఓ నేత నిలదీయడంతో మరో వర్గం ఆయనపై దాడికి దిగింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి ఒకరు 'బాలయ్య పీఏపై విమర్శలు' అంటూ ఓ ఫొటోను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేశారు.

ఈ మెసేజ్ హిందూపురం మీడియా గ్రూప్‌లో ఉన్న వారందరికీ వెళ్లింది. ఈ గ్రూప్‌లో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. హిందూపురం రూరల్ పోలీసుస్టేషన్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన ఏఎస్‌ఐ తిరుపాల్‌కు ఏ ఫొటోలు వచ్చినా థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో వచ్చిన ఇమేజ్ చూసి థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు.

ఈ విషయాన్ని బాలకృష్ణ పీఏ  దృష్టికి కొందరు మరో రకంగా తీసుకెళ్లారు. దీంతో బాలయ్య పీఏ .. ఆ ఏఎస్‌ఐకి ఎందుకంత సంతోషం అంటూ డీఎస్పీ సుబ్బారావు వద్ద తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. దీంతో తిరుపాల్‌ను హుటాహుటిన సోమవారం సోమందెపల్లెకు బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement