రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వం తరచూ ప్రకటనలు గుప్పిస్తోంది. నేటి అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పు, స్మార్ట్ క్యాంపస్‌లుగా తీర్చిదిట్టం, పూర్తిస్థాయిలో కోర్సుల బలోపేతం, అధ్యాపకుల నియామకం, వైఫై, జీ-ఇంటర్నెట్ కనెక్టవిటీ వంటివి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటి స్తున్నా.. అది ఎప్పటికి సాకారమవుతుందోనని విద్యార్థులతోపాటు జిల్లా ప్రజలు.. విద్యారంగ నిపుణులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఎచ్చెర్ల: రాష్ట్రంలో 16 యూనివర్సిటీలుండగా, 11 వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 12(బి) గుర్తింపు ఉంది. ఐదింటికి ఈ గుర్తింపులేదు. ఇందులో ఏడేళ్ల క్రితం (2008, జూన్ 25) ఏర్పడిన ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఒకటి. ఈ గుర్తింపులేక ఏటా వర్సిటీలకు మంజూరయ్యే కోట్ల రూపాయిల నిధులు ఈ వర్సిటీ కోల్పోతోంది. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం సైతం బడ్జెట్‌ల్లో అరకొర నిధులే మంజూరు చేస్తోంది. దీంతో వర్సిటీకి నిధుల కొరత వెంటాడుతోంది.
12(బి)రావాలంటే...
కనీసం ఐదు డిపార్టమెంట్లలో పూర్తి స్థాయి బోధకులు ఉండాలి. మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఉండాలి. ప్రస్తుతం వర్సిటీలో రూ. 18 కోట్ల అంచనా విలువతో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అకడమిక్ బ్లాక్ నిర్మాణం సాగుతోంది. ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తయ్యే అవకావముంది. ఇది పూర్తయితే దాదాపుగా వసతి కొరత సమస్యకు తెరపడే అవకావముంది. అప్పుడే రెగ్యులర్ బోధకుల నియామకం ద్వారా 12(బి) గుర్తింపు సాధ్యం అవుతుంది. ప్రస్తుతం వర్సిటీలో ఎంసీఏ, ఎంబీఏ, ఇంగ్లీష్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎడ్, ఎంఎల్‌ఐఎస్సీ, గణితం, ఎల్‌ఎల్‌బీ, రూరల్ డెవలప్‌మెంట్, ఎకనామిక్స్, ఎంకాం, బయోటెక్, సోషల్‌వర్క్, జియోటెక్, బీఎడ్ (మానసిక వికలాంగులకు), తెలుగు, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు ఉండగా, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఇద్దరు, రూరల్ డెవలప్ మెంట్‌లో ఇద్దరు, ఎకనామిక్స్‌లో ఒక్కరు. బయోటె క్నాలజీలో నలుగురు, సోషల్ వర్క్‌లో ముగ్గురు రెగ్యులర్ బోధకులున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్(కాంట్రాక్ట్ బేసిక్), టీచింగ్ అసోసియేట్స్ పై బోధనారంగం కొనసాగుతోంది.
49 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్
వర్సిటీలో రెండు నోటిఫికేషన్లు రెండుసార్లు జారీ చేశారు. 2013 జూన్ 22న 34 పోస్టులకు, 2014 మార్చి1న 15 పోస్టుల నియామ కానికి నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియ సైతం పూర్తయింది. ప్రభుత్వ అనుమతులు కోసం అధికారులు నిరీక్షిస్తున్నారు. ఈ నియామకాలు పూర్తయితే చాలావరకు బోధకుల కొరత సమస్యకు పరిష్కారం లభించటంతో పాటు మరో పక్క 12(బి) గర్తింపు సాధ్యమవుతుంది.
రాష్ట్ర బడ్జెక్ట్ పైనే ఆధారం
వర్సిటీ రాష్ట్ర బడ్జెట్‌పైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకులకు యూజీసీ మ్యాచింగ్ గ్రాంట్ లభిస్తుంది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు కూడా 12(బి) గుర్తింపులేని యూనివర్సిటీలకు ప్రత్యేకించి ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటా యింపులు చూస్తే 2009-10లో రూ. 2.50 కోట్లు, 2010-11లో రూ.1.62 కోట్లు, 2011-12లో రూ.2.75 కోట్లు, 2012-13లో రూ. 4.78 కోట్లు, 2013-14లో 10.26, 2014-15 లో రూ. 10.26 కోట్లు కేటా యింంచారు.
2015-16లో బడ్జెక్ట్ కేటాయింపులు మెరుగ్గా ఉంటాయని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలికి రూ. 23 కోట్లు కోట్లు అవసరంగా నివే దిక అందజేశారు. ప్రభుత్వం స్మార్ట్ యూనిర్సిటీలుగా తీర్చి దిద్దు తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో వేచిచూడ వల్సిందే.
స్మార్ట్ వర్సిటీ ఎప్పుడో?
Published Thu, Feb 26 2015 12:55 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement