శాసనసభ సమావేశాల చివరి రోజున శనివారం పలువురు సభ్యులు జీరో అవర్‌లో పలు అంశాలు, సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
- జీరో అవర్‌లో
పాణ్యం ఎమ్మెల్యే ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ సమావేశాల చివరి రోజున శనివారం పలువురు సభ్యులు జీరో అవర్‌లో పలు అంశాలు, సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఇంగ్లీషు మీడియం విద్య అందించేలా చర్యలు చేపట్టాలని ప్రస్తావించారు.
కర్నూలు జిల్లాలో ఇప్పటికీ ప్రారంభం కాని నాలుగు స్కూళ్లను ఎప్పటిలోగా ప్రారంభిస్తారో తెలపాలని కోరారు. అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మిట్టమీదిలింగాపురానికి చెందిన 2500 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రాకుండా అగ్రవర్ణాల వారు అడ్డుకుంటున్నారని, దీనిపై చర్య తీసుకోవాలని కోరారు.