హైదరాబాద్: సినీ దర్శకుడిగా ఉన్న తన భర్త గత కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ నిరసన చేపట్టింది. హరికృష్ణ అనే సినీ దర్శకుడు మానసికంగా వేధిస్తున్నాడంటూ అతని భార్య శ్రీలేఖ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఆమె నెల్లూరు జిల్లా వాకాడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. తనను ఇంటి నుంచి గెంటివేసిన అతను పాపను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఆమె.. పాపను అప్పగించాలంటూ నిరసన చేపట్టింది. దీంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారైయినట్లు తెలుస్తోంది.