అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పంచుతాం: బాబు | will diversify development to all parts, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పంచుతాం: బాబు

Published Fri, Aug 15 2014 10:13 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పంచుతాం: బాబు - Sakshi

అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పంచుతాం: బాబు

ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని పంచాలన్నదే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశభక్తిలో, జాతీయతలో తెలుగువారికి సాటి ఎవరూ లేరని చెప్పారు. కానీ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలుగువారి పట్ల ఎప్పుడూ వివక్షనే చూపిందన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడంలోను, ఇప్పుడు ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడంలోను ఆ పార్టీయే దోషిగా ఉందన్నారు. అందుకే ప్రజలు ఆ పార్టీని కసిగా ఓడించారన్నారు.

తొలినాళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68వ స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించింది. కర్నూలులో ఉన్న ఏపీఎస్పీ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకటరాముడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలలోని అధికారులకు అవార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement