265 ఎంయూల విద్యుత్ సరఫరా చేస్తున్నామా? | will we 265 MU produce power supply for Andhra pradesh, says Kiran kumar reddy ? | Sakshi
Sakshi News home page

265 ఎంయూల విద్యుత్ సరఫరా చేస్తున్నామా?

Published Wed, Feb 12 2014 1:00 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

265 ఎంయూల విద్యుత్ సరఫరా చేస్తున్నామా? - Sakshi

265 ఎంయూల విద్యుత్ సరఫరా చేస్తున్నామా?

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశ్చర్యం
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 265 మిలియన్ యూనిట్ల (ఎంయు)ను విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారా అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశ్చర్యం వెలిబుచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, డిమాండ్, కోతలపై సీఎం మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 290 ఎంయూలు ఉండగా...  265 ఎంయూలు సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. 25 ఎంయూల మేరకు.. గ్రామాల్లో 12 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, హైదరాబాద్‌లో 2 గంటలతోపాటు పరిశ్రమలకు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకూ కోతలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
 
 ఈ సందర్భంగా 265 ఎంయూలు సరఫరా చేస్తున్నారా అని సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు కోతల ఎత్తివేతపై సీఎం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలి సింది. ఈ నెలాఖరుకు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటులో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని జెన్‌కో ఎండీ విజయానంద్ తెలిపారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాహూ, ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement