
మృతిచెందిన అల్లాడి వెంకటలక్ష్మి (46)
సాక్షి, పశ్చిమగోదావరి : స్పిన్నింగ్ మిల్లు మిషన్‌లో పడి ప్రమాదవశాత్తూ మహిళ తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పెరవలి ఎస్సై డీవై కిరణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లికి చెందిన అల్లాడి వెంకటలక్ష్మి (46) పెరవలి మండలం మల్లేశ్వరం ఎస్‌వీఆర్ స్పిన్నింగ్ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. శుక్రవారం వేకువజాము షిప్ట్‌లో పనిచేస్తున్న వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తూ మిషన్‌లో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందిస్తుండగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుమారుడు అల్లాడి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment