లారీ బోల్తా: ఇద్దరు మహిళలు మృతి | Woman killed in lorry accident at prakasam district | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా: ఇద్దరు మహిళలు మృతి

Published Thu, Feb 13 2014 9:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

Woman killed in lorry accident at prakasam district

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం ఏలూరుపాడు సమీపంలో బాతుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఆ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించారు.

 

దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన మహిళల మృతదేహలను స్వాధీనం చేసుకుని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement