పాదచారులపై దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి | Two people killed in lorry accident at Prakasam District | Sakshi
Sakshi News home page

పాదచారులపై దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి

Published Tue, Dec 24 2013 8:22 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

Two people killed in lorry accident at Prakasam District

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో వద్ద మంగళవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ రహదారిపై వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

 

దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ దుర్ఘటనలో మరణించిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీతిమీరిన వేగంతోనే వాహనం నడపడం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పోలీసులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement