సాక్షి, అమరావతి: దీర్ఘకాల లాక్‌డౌన్ నేపథ్యంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు ఒక్క ఫోన్ చేస్తే పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఉచిత మహిళా సహాయతా నెంబరు 181 కు బాధితులు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గృహహింస బాధితుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు.
► ఇప్పటికే పని చేస్తున్న దిశ వన్‌స్టాఫ్ కేంద్రాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. బాధిత మహిళలకు ఈ కేంద్రాల్లో ఆరోగ్య, వైద్య, మానసిక, న్యాయ సహాయాలను నిపుణుల ద్వారా అందిస్తాం. ఈ కేంద్రాల్లో అందించే సేవలన్నీ ఉచితమే.
► అవసరమైన వారికి అత్యవసర వసతిని ఒకే చోట కల్పిస్తాం. అలాగే రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో సైతం వసతి, రక్షణ కల్పిస్తాం.
► బాధితులకు సహాయం అందించేందుకు జిల్లాల వారీగా అధికారులను నియమించాం. వారి నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment