సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సృష్టికి.. త్యాగానికి.. అనురాగానికి.. ఆత్మీయతకు.. అనుబంధానికి.. ప్రతిరూపం మహిళ. ఇంటిపని, వంటపనికే పరిమితం కాకుండా... పురుషులకు తామేమీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. ఇల్లాలిగా భర్తకు సేవచేస్తూ.. అమ్మగా పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ.. వారి భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటూనే.. ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ.. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. జిల్లా జనాభాలోనూ పురుషులకంటే వారే ఎక్కువగా ఉన్నారు.
అదేవిధంగా ప్రజాప్రతినిధిగా గ్రామ, మండల, నియోజకవర్గ, మున్సిపాలిటీలు, జిల్లా పాలనలోనూ మహిళ ముందుకు దూసుకెళ్తున్నారు. అన్నింటా తానై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అందుకు జిల్లా పరిపాలనాధికారి జానకినే నిదర్శనంగా చెప్పొచ్చు. అదేవిధంగా వైద్య ఆరోగ్య, స్త్రీశిశు సంక్షేమం, పౌరసరఫరాల శాఖ వంటి ముఖ్యమైన శాఖల్లోనూ మహిళలే అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా భద్రతాధికారులు, ప్రాణం పోసే వైద్య వృత్తిలో.. జ్ఞానాన్ని పంచే ఉపాధ్యాయురాళ్లు.. పారిశ్రామికవేత్తలు.. రైతులు, కూలీలు, వాహన డ్రైవర్లు, వివిధ వృత్తుల్లో ముందుకెళ్తున్న మహిళలు ఎందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. వికలాంగులైన మహిళలు కూడా ఉన్నత చదువులు చదివి.. లక్ష్యం చేరుకున్న వారెందరో ఉన్నారు.
అన్నింటా ‘ఆమె’
Published Sun, Mar 8 2015 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement