హైదరాబాద్ : మద్యంపై మహిళా సంఘాలు మళ్లీ కదిలాయి. మద్య నింత్రణ ఉద్యమ కమిటీ మహిళా సంఘాల నేతలు ఈ రోజు నాంపల్లి అబ్కారీ భవన్లో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్లను కలిశారు.
మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూడరాదని వారు కమిషనర్లను కోరారు. ఎక్సైజ్ సిబ్బందికి లక్ష్యాలు కూడా విధించవద్దని విజ్ఞప్తి చేశారు.