పనిచేసినా పస్తులే! | workers are feeling incomfort for wages | Sakshi
Sakshi News home page

పనిచేసినా పస్తులే!

Published Wed, Sep 4 2013 4:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM

workers are feeling incomfort for wages

 మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: వలసలు నివారించి..కూలీలకు స్థానికం గా పనులు క ల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టి న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత ఏర్పడింది. చేసిన పనులకు మూ డు నెలలుగా బిల్లులు రాకపోవడంతో కూలీలు పూట గడవకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పథకం ప్రారంభం నుంచీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదు. మన జిల్లాలో రూ.13 కోట్ల రూపాయలను కూలీలకు చెల్లిం చాల్సి ఉంది.
 
 రోజూ కూలికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితుల్లో జిల్లాలో చాలా కుటుంబాలు ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించి కడుపులు మాడిపోకుండా చూడాలని కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్‌కు రోజు వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నా ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కూలీలకు స కాలంలో పంపిణీ చేసేందుకు అధికారులు చ ర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిధులే విడుదల కాకపోతే ఏం చేయాలంటూ వారు ఆవేదన చెందడం తప్ప కూలీలకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు.
 
 ప్రభుత్వ నిర్ణయంతో అయోమయం
 ఉపాధి పనుల కోసం 7,85,927 కుటుంబాల కు జాబ్ కార్డులు జారీ చేశారు. మూడు, నాలు గు నెలల క్రితం వరకు జిల్లాలో ప్రతిరోజూ 70 నుంచి 80 వేల మంది కూలీలు ఉపాధి పనుల కోసం వెళ్లేవారు. బిల్లులు నిలిపేయడంతో ఉ పాధి పనులు అడిగేవారే లేకుండా పోయారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం మూడువేల మందికి మించి పనులకు వెళ్లడం లేదు. ఇదిలాఉండగా గతంలో పనులు మంజూరై ఇప్పటివరకు పూర్తికాని వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
 
 మూడేళ్ల క్రితం వరకు ఉపాధి పథకం ద్వారా మం జూరైన పండ్ల మొక్కల పెంపకం, వ్యక్తిగత మ రుగుదొడ్ల నిర్మాణం కోసం మంజూరైన పనులు మినహా మిగిలిన పనులన్నీ రద్దు చేయాలని ప్ర భుత్వం నిర్ణయింది. దీంతో జిల్లాలో 1.50 లక్ష ల పనులను గుర్తించి వాటిని ఈనెల 15వ తేదీ వరకు రద్దు చేసేందుకు జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత కొత్తగా పను లు అడిగే వారికి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
 
 15 రోజుల్లో
 కూలీలకు డబ్బు చెల్లిస్తాం
 ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన కూలీలకు 15 రోజుల్లో డబ్బు చెల్లిస్తాం. నిధుల మంజూరు సమస్య తలెత్తడంతో దాదాపు రెండున్నర నెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. విడతల వారీగా డబ్బులు చెల్లించేందుకు ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం..
 - వెంకటరమణారెడ్డి, డ్వామా పీడీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement