ధన్వాడ / కోస్గి, న్యూస్‌లైన్ : వారంతా పేదలు.. రెక్కాడితేగాని డొక్కాడని ప రిస్థితి... వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ పొట్టపోసుకుంటున్నారు.. వా రిని విధి వెక్కిరించడంతో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మొత్తం 38 మం ది ఓ డీసీఎంలో బయలుదేరగా మార్గమధ్యంలోనే బోల్తా పడటంతో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం పాల య్యారు. ఈ సంఘటనలో మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... బుధవారం ఉదయం కోస్గి మండలం గుండుమాల్‌కు చెం దిన లక్ష్మి, అదే గ్రామానికి చెందిన 38 మంది కూలీలను ధన్వాడ మండలం మణిపూర్ తండాలోని రైతు దీప్లానాయక్ తోట నుంచి బత్తాయిపండ్లు తీ సుకెళ్లడానికి ఓ డీసీఎంలో తరలిం చింది.
వాటిని వాహనంలో లోడ్ చేశాక సాయంత్రం అందరూ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యం లోని రాంకిష్టాయపల్లి సమీపంలోకి చే రుకోగానే అదుపుతప్పి బోల్తా పడటం తో గుడిసె రాములమ్మ (49), పుల మొళ్ల వెంకటమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కూలీలు రాధ మ్మ, సాయమ్మ, మాణిక్యమ్మ, అంజిలయ్య, మరో వెంకటమ్మ, అంజిలమ్మ, ఆశమ్మ, మొగులమ్మ, రాజమ్మ, లక్ష్మి, సురేష్, సుజాత, శాంత, రాములమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇది గమనించిన స్థానికులు వెంటనే మరికల్ పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగ్రాతులను హుటాహుటిన ధన్వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను ఆర్డీఓ షేక్‌యాస్మిన్‌బాషా, స్థానిక తహశీల్దార్ మురళీకృష్ణ పరామర్శించారు. ఈ సంఘటనలో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
‘కూలి’న బతుకులు
Published Thu, Dec 12 2013 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement