రాజన్నా..నిను మరువలేం
కర్నూలు రూరల్: ఆరోగ్యశ్రీతో పేదలకు ఖరీదైన వైద్యం అందించిన డాక్టర్.. జలయజ్ఞంతో వేలాది ఎకరాలను సాగులోకి తెచ్చి భగీరథుడు.. ఉచిత విద్యుత్, రుణమాఫీతో అన్నదాతలను ఆదుకున్న రైతుబాంధవుడు.. ఇందిరమ్మ ఇళ్లు, ఫీజ్ రీయింబర్స్ మెంట్, 104, 108.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన పేదల దేవుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మంగళవారం ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
పేదల గుండెల్లో నిలిచిన నేతను మనసారా స్మరించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్ 5వ వర్ధంతిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నారు. వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్నూలు నగరంలో ఎస్‌బీఐ సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ హరినాథరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రెండు వేల మందికి వైద్య సేవలు అందించారు. మూడు లక్షల రూపాయల విలువైన మందులను పంపిణీ చేశారు.
బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో వైఎస్సార్ అభిమాని రామగంగిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మెట్టపల్లిలో పేదలకు అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డోన్ పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
డోన్ మండలం ధర్మవరంలో గౌతం కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆలూరులో జెడ్పీటీసీ సభ్యుడు రాంభీం నాయుడు, హాలహర్విలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భీమప్ప చౌదరి, హోళగుందలో మండల కన్వీనర్ షఫీవుల్లా ..వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు కె.జగన్మోహన్‌రెడ్డి, రుద్రగౌడ్‌ల ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోవెలకుంట్ల మండలంలో అభిమానులు, అవుకులో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి, సంజామల మండలంలో జెడ్పీటీసీ సభ్యుడు చిన్నబాబు, ఎంపీపీ గౌరు గారి ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు.
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య తనయుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మిడుతూరులో జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, పత్తికొండలో కేడీసీసీ మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, అడ్వకేట్ దామోదర్ ఆచారి, తుగ్గలి మండలం రాతనలో సింగిల్ విండో డెరైక్టర్ విజయ్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్ సుంకమ్మ, ఎర్రగుడి గ్రామంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జిట్టా నగేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు.