సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం జన భేరి మోగించనున్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ దాకా ఆమె జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే నెల రోజులకు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరిగేందుకు షెడ్యూల్ విడుదలైంది. వరుస ఎన్నికలతో వైఎస్సార్ సీపీ శ్రేణులు బిజీ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరడంతో పాటు, జరగబోయే ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎంపీగా గెలిపించాలని కోరుతూ షర్మిల ప్రచార శంఖం పూరించనున్నారు.
17వ తేదీ సాయంత్రం ఆత్మకూరులో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నియోజక వర్గ సమన్వయ కర్త మేకపాటి గౌతమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో జిల్లాలో షర్మిల ఎన్నికల జనభేరిని మోగిస్తారు. 18వ తేదీ ఉదయం వెంకటగిరిలో బహిరంగ సభ, నాయుడుపేటలో రోడ్‌షో, సూళ్లూరుపేటలో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి గూడూరులో బస చేసి 19వ తేదీ ఉదయం రోడ్ షో చేస్తారు. అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి నెల్లూరులో బస చేసి 20వ తేదీ ఉదయం కావలిలో రోడ్ షో జరిపి మున్సిపల్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తారు.
జిల్లాలో షర్మిల ప్రచారభేరి
Published Thu, Mar 13 2014 3:10 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement