
యల్లంపల్లెలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పెద్దిరెడ్డి
చౌడేపల్లె: మండలంలోని గడ్డంవారిపల్లె పంచాయతీ యల్లపల్లెలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో 30 మంది యువకులు, మహిళలు వైఎస్సార్‌సీపీలో చేరారు. దాత దామోదర రాజు నేతృత్వంలో ఎంపీపీ అంజిబాబు, జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ, తదితరుల నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్థానికులకు మంచిపెట్టారు. అనంతరం గజమాలతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, మాజీ జెడ్పీవైస్ చైర్మన్ పెద్దిరెడ్డిని సన్మానించారు. మండల పార్టీ అధ్యక్షుడు గాజుల రామ్మూర్తి, నేతలు మిద్దింటి శంకర్ నారాయణ, రవిచంద్రారెడ్డి, మునస్వామిరాజు, రమేష్, పద్మనాభరెడ్డి, రమణారెడ్డి,మునిరాజ, గోవిందు తదితరులున్నారు.
ఎల్లమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే..
చారాలకురప్పల్లెలో దాత, పారిశ్రామికవేత్త దామోదరరాజు, గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత నడివీధి ఎల్లమ్మను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దర్శించకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగ తం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలపై ఆరతీశారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ.. స్థానికులకు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment