సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేయతలపెట్టిన అప్పులకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. నాల్గో త్రైమాసికంలో రూ.3 వేల కోట్ల అప్పు చేసేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.2 వేల కోట్లు అప్పునకు మాత్రమే అనుమతించింది.
కాగా మంగళవారం సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ.1,000 కోట్ల అప్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల విక్రయం ద్వారా చేసిన అప్పు రూ.16,500 కోట్లకు చేరనుంది.
అంత అప్పు కుదరదు...: కేంద్రం
Published Tue, Jan 10 2017 1:34 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement