కొత్తవలస: విద్యార్థిని ఆత్మహత్య కేసులో గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన సూరెడ్డి పాలబాబు(22)ను మంగళవారం ఉదయం స్థానిక గవరపాలెం వద్ద పట్టుకుని అరెస్టు చేసి కొత్తవలస కోర్టుకు తరలించినట్లు కొత్తవలస ఎస్‌ఐ ఎస్.ధనుంజయరావు తెలిపారు. మండలంలో గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన జామి మమత(15)పై అదే గ్రామానికి చెందిన పాలబాబు ఈ నెల 5వతేది అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడబోగా మమత తల్లి చూసి మందలించింది. అయితే ఆ అవమాన భారం భరించలేక బాలిక తెల్లవారుజామున గ్రామశివారులో ఉన్న నేలబావిలో దూకిఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని మంగళపాలెం గ్రామం సమీపంలో ఉన్న సెయింట్‌ఆన్స్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతుంది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యార్థిని ఆత్మహత్య కేసులో యువకుని అరెస్టు
Published Wed, Jun 11 2014 1:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement