డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్ గ్రామంలో సోమవారం రాత్రి విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడు విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు, స్థాని కుల వివరాల ప్రకారం... మండల వ్యవసాయశాఖలో పనిచేసే కిషన్ ఇంట్లో విద్యుత్ సర ఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక జేఎల్‌ఎంకు ఆయ న ఫోన్ చేశాడు.
జేఎల్‌ఎం స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరా సరిచేయాల్సి ఉండగా, స్థానిక యువ కుడు, ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న హమాలీ శ్రీనివాస్ (23)ను పిలిచి స్తంభంపైకి ఎక్కించాడు. సబ్‌స్టేషన్ నుంచి ఎల్‌సీ తీసుకుని స్తంభం ఎక్కి విద్యుత్ సర్వీస్ వైరును సరిచేస్తుం డగా, అదే స్తంభానికి పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు శ్రీనివాస్ చేతికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కిందనున్న విద్యుత్ వైర్లపై పడి విలవిల్లాడుతూ కొట్టుకోసాగాడు. వెంటనే స్థానికులు గమనించి ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందజేశారు.
గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో శ్రీనివాస్ మృతదేహాన్ని కిందికి దించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది శ్రీనివాస్‌లో ప్రాణం ఉందేమోనని ప్రయత్నించినా లాభం లేకపోయింది. వేలాది రూపాయలు జీతం తీసుకుంటున్న ట్రాన్స్‌కో సిబ్బంది తాము చేయాల్సిన పనిని ఇతరుల చేత చేయిస్తూ అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి తగిన నష్టపరిహారం ఇవ్వాలని, అప్పటి వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేది లేదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అందోళనకు దిగారు. పది రోజుల క్రితమే మృతుడి తండ్రి హమాలీ సాయిలు అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.అంతలోనే కొడుకు మృతిచెందడంతో ఆ కుటుం బంలో పుట్టెడు విషాదం నెలకొంది. శ్రీనివాస్‌కు తల్లి భూదవ్వ, అన్న సాగర్, అక్కలు సుమలత, కళావతి ఉన్నారు.
కాటేసిన కరెంట్
Published Tue, Feb 11 2014 4:56 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement