బాడంగి: రైలు కింద పడి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం బాడంగి మెయిన్‌రోడ్డు పక్కన నివసిస్తున్న ఏకల ఎండయ్య, రాములమ్మకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తెకు పెళ్లికాగా రెండోకుమార్తె సత్యవతికి వివాహం కావలసి ఉంది. ఆమె ఖాళీ మద్యం సీసాల క్లీనింగ్‌ప్లాంట్‌లో దినవేతన కార్మికురాలిగా పనిచేస్తోంది.
ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఆలయ దర్శనానంతరం పనికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయల్దేరింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాడంగి రైల్వేగేటు సమీపంలో విజయనగరం వైపునుంచి బొబ్బిలి వెళ్తున్న నాగావలి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.
రైలు డ్రైవర్ విజయనగరం పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రైల్వే ఎస్‌ఐ ఖగేశ్వరరావు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. అనంతరం సత్యవతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. సత్యవతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం బొబ్బిలి తరలించారు.కుమార్తె అఘాయిత్యంతో తల్లిదండ్రులిద్దరు రోదిస్తున్నారు.
రైలు కిందపడి యువతి ఆత్మహత్య
Published Wed, Jul 13 2016 12:39 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement