పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన పాలకొల్లు మండలం ఆగరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన పెద్దిరామ్(27) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్న పెద్దిరామ్ బుధవారం ఉదయానికి మృతదేహమై పడి ఉన్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసునత్రికి తరలించారు.