
సాక్షి, మచిలీపట్నం : సివిల్స్‌లో 512వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. మొన్న ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ 512వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా గురువారం వైఎస్ జగన్.. ప్రవీణ్ చంద్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.
ఐఐటీ పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రవీణ్ చంద్ 2016 సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అవకాశం రాలేదు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ఇచ్చి సివిల్స్ సాధించారు. నలుగురికి సేవ చేయాలనే తాను సివిల్స్ రాసినట్టు ప్రవీణ్ చంద్ తెలిపారు. వైఎస్ జగన్ ఫోన్ చేసి అభినందనలు తెలపడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment