వైయస్ జగన్‌కు ఘనంగా వీడ్కోలు | YS Jagan gloriously farewell | Sakshi
Sakshi News home page

వైయస్ జగన్‌కు ఘనంగా వీడ్కోలు

Published Thu, Dec 26 2013 2:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

YS Jagan gloriously farewell

ముద్దనూరు,న్యూస్‌లైన్: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని పులివెందుల నుండి హైదరాబాదుకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఎంపీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం రాత్రి ముద్దనూరు రైల్వేస్టేషన్‌లో  అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు.
 
  సతీమణి భారతి,కుమార్తెలతో కలిసి ఆయన హైదరాబాదుకు బయలుదేరారు. పలువురు నాయకులను,అభిమానులను ఆయన ఆత్మీయంగా పలకరించారు. క్రీడాపోటీలకు హైదరాబాదుకు వెళ్తున్న వేముల విద్యార్థినులకు అయన అభినందనలు తెలిపారు. కొర్రపాడు మాజీ సర్పంచ్ అపర్ణ ముంపుసమస్యలను జగన్‌కు వివరించారు. మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి కూడా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాదుకు వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement