
వాకతిప్ప బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం వాకతిప్ప విస్ఫోట బాధితులను పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
కాకినాడ చేరుకున్న జగన్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాలు అందేవిధంగా వత్తిడి తెస్తామని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శించారు.
**