Firecracker blast
-
కేరళ నీలేశ్వరం ఆలయం సమీపంలో బాణాసంచా పేలుడు..
-
ఇంట్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు
ఓ ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఇల్లు ద్వంసమైంది. ఇంట్లోని ముగ్గురు సజీవ దహనమయ్యారు.మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఖార్ఖోడా తాలూకాలోని రిదౌ గ్రామంలో ఇంట్లో అక్రమంగా బాణా సంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని హర్యానా పోలీసులు తెలిపారు. #WATCH | Sonipat, Haryana: 3 killed and 7 injured in an explosion in a house in Ridhau village of KharkhodaSonipat ACP Jeet Singh says, "Information was regarding a blast in a house and we have found material used in firecrackers from the spot.Some people said a cylinder… pic.twitter.com/j6olCoJNCc— ANI (@ANI) September 28, 2024 సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారని సోనెపట్ ఏసీపీ జీత్ సింగ్ చెప్పారు. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. పేలుడు సంభవించిన ఇంట్లో పటాకుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి చెందిన బృందం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. -
తమిళనాడు: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
విరుదనగర్: తమిళనాడులో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదనగర్ జిల్లా చతుర్ దగ్గర ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగారు. ఫ్యాక్టరీలో భారీగా దీపావళి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. -
బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దీపావళి పండగ వేళ ముందస్తు అనుమతితోనే గోపాల్‌బాగ్ ప్రాంతంలో బాణాసంచా దుకాణాలు వెలిశాయి. పండగ కావడంతో మార్కెట్ జనంతో కిటకిటలాడుతోంది. మొదట ఓ షాప్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న ఏడు దుకాణాలకు ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరగడంతో జనం పరుగులు పెట్టారు. ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ షాక్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంటల్లో పలు వాహనాలు కూడా కాలిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచా అమ్మకాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీ వాసులకు అలర్ట్! -
దీపావళి రోజు విషాదం.. టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు మృతి
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా జిల్లా): దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్ కాలనీలో సీతానగర్‌లో టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. టపాసులు ఆరబెడుతుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనంపై నిప్పులు పడటంతో ట్యాంక్ అంటుకుని వాహనం పేలిపోయింది. దీంతో బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు. చదవండి: టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య టపాసులు, బైక్ పేలిన శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు.. బాలుడిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. దీంతో సీతానగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బాణసంచా గోదాంలో భారీ పేలుడు.. నలుగురు మృతి
భోపాల్: బాణసంచా నిలువ చేసిన గోదాంలో భారీ పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా బన్మోర్ నగర్లో గురువారం జరిగింది. భారీ పేలుడుతో ఫైర్‌క్రాకర్స్ నిలువ చేసిన గోదాం తునాతునకలైంది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘గోదాంలోని గన్‌పౌడర్ వల్ల పేలుడు జరిగిందా లేదా గ్యాస్ సిలిండర్ పేలటం వల్లనా అనే అంశంపై దర్యాప్తు చేపట్టాం. ఈ పేలుడులో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.’ అని మొరేనా కలెక్టర్ బక్కి కార్తికేయన్ తెలిపారు. గోదాం శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలను మోహరించామని, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఐజీ రాజేశ్ చావ్లా తెలిపారు. మూడేళ్ల క్రితం పంజాబ్‌లో ఇలాంటి సంఘటనే జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: దీపావళి సెలవుపై ప్రభుత్వం కీలక ప్రకటన.. పబ్లిక్ హాలీడే ఎప్పుడంటే.. -
బాణాసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, ఆరుగురు మృతి
చెన్నై : తమిళనాడులోని శివకాశిలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 14 మందికి గాయాలయ్యాయి. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలో ఓ ప్రైవేటు బాణాసంచా తయారీ పరిశ్రమలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో ప్రమాదం సంభవించి పది గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కూలీలు మృత్యువాతపడగా.. 14 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే గుర్తించడం సాధ్యం కాలేదు. వరుసగా పేలుళ్లు చోటుచేసుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో మూడు పేలుడు ఘటనలు జరిగాయి. ఈ నెల 12న అచ్చంకుళంలోని ఓ బాణ సంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని మధురై హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ రోజు మధ్యాహ్నమే ఆదేశించింది. చదవండి: బంజారాహిల్స్‌లో బీఎండబ్ల్యూతో ఉడాయించిన డ్రైవర్ సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బటాలా: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు తీవ్రతకు బాణాసంచా ఫ్యాక్టరీ నేలమట్టం కాగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భయానక అనుభవం.. బటాలా అగ్నిప్రమాదంపై తమ భయానక అనుభవాలను స్థానికులు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయమై రాజ్‌పాల్ ఖక్కర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..‘నేను సమీపంలోని గురుద్వారాకు వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నేను నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచిచూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను’ అని తెలిపారు. సాహిబ్ సింగ్ అనే మరో వ్యక్తి స్పందిస్తూ..‘సెప్టెంబర్ 5న గురునానక్ దేవ్ 532వ వివాహ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లాను. అంతలోనే భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే నేను తిరిగి స్పృహలోకి రావడానికి చాలాసేపు పట్టింది’ అని వ్యాఖ్యానించారు. మృతులకు 2 లక్షల పరిహారం బటాలా దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బటాలా అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ విచారణ చేపడతారని వెల్లడించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి రాజేందర్ సింగ్‌కు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు బటాలా సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంజీవ్ భల్లా మాట్లాడుతూ.. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెలవుపై ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెనక్కు పిలిపించామని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్, రాహుల్ దిగ్భ్రాంతి బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశా>రు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోవడంపై రాహుల్ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బటాలా దుర్ఘటనపై గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీడియోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాలువలోకి ఎగిరిపడ్డ కార్లు.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు భవనాలు కూలిపోయాయి. దగ్గర్లోని కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు ఎగిరి సమీపంలోని కాలువలో పడిపోయాయి. పేలుడు ప్రకంపనలకు కిలోమీటర్ దూరంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. చాలామంది క్షతగాత్రుల తల, కాళ్లకు గాయాలయ్యాయి – విపుల్ ఉజ్వల్, గురుదాస్‌పూర్ డీసీపీ పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలను తీసుకెళ్తున్న పోలీసులు, స్థానికులు -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 19 మంది మృతి
గురుదాస్‌పూర్ : పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని ఓ బాణాసంచా ప్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా యంత్రాగం పరిస్థితిని సమీక్షిస్తుంది. గురుదాస్‌పూర్ బటాలాలోని నివాస ప్రాంతాల్లో ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి బాణసంచా ఫ్యాక్టరీ పూర్తిగా కుప్పకూలిందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
సాక్షి, నలంద : బిహార్‌లోని నలంద జిల్లా జబల్పూర్లోని ఓ బాణాసంచా దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 25 మందికి గాయాలయ్యాయి. ఫ్యాక్టరీకి సమీపంలోని పలు గృహాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్ధలం నుంచి దాదాపు కిలోమీటర్ వరకూ పొగలు వ్యాపించాయి. పోలీసు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో గాయపడిన వారిని నలంద డీఎం, ఎస్పీలు ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. పేలుడుపై విచారణ కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడి ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఘటనా స్ధలాన్ని సందర్శించింది. -
ఇండోనేసియాలో ఘోర ప్రమాదం.. 47 మంది మృతి
-
ఘోర ప్రమాదం.. 47 మంది దుర్మరణం
జకార్తా : ఇండోనేసియాలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ లోని ఓ బాణా సంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 47 మంది మృతి చెందినట్లు సమాచారం. కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి, మంటలు మొత్తం చుట్టుపక్కల త్వరగతిన వ్యాపించాయి. దీంతో తప్పించుకునే వీలు లేకుండా పోయింది. మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతంగా కాలిపోయాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మరో 43 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో దాని పక్క ఉన్న ఫ్యాక్టరీ కూడా సగం వరకు కూలిపోగా, పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కాగా, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వాకతిప్ప బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
ప్రచారం ఆధారంగా బాబు పరిహారం!:వైఎస్ జగన్
కాకినాడ: ప్రచారం ఆధారంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడినవారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు పరిహారం చంద్రబాబు సరైన రీతిలో ప్రకటించడంలేదని అన్నారు. ప్రచారం ఎక్కువగా జరుగుతుందని అనుకుంటే అక్కడ 5 లక్షల రూపాయలు ప్రకటిస్తారని చెప్పారు. తక్కువ ప్రచారం ఉన్నచోట లక్ష లేక రెండు లక్షల రూపాయలే ప్రకటిస్తారని అన్నారు. ఈ గ్రామంలో పేలుడు ఘటనలో చనిపోయినవారందరూ కూలీలేనని చెప్పారు. పరిహారం అందరికీ సమానంగా ఉండాలని జగన్ డిమాండ్ చేశారు. ** -
వాకతిప్ప బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్
-
వాకతిప్ప బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం వాకతిప్ప విస్ఫోట బాధితులను పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాకినాడ చేరుకున్న జగన్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాలు అందేవిధంగా వత్తిడి తెస్తామని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శించారు. ** -
పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య
-
పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి
-
పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. మృతులలో 14 మంది మహిళలు ఉన్నారు. ఈ దుర్ఘటనలో నిన్న 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు. ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ** -
పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణాసంచా పేలుడు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. **