పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య | 18 persons died in explosion | Sakshi
Sakshi News home page

పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య

Published Tue, Oct 21 2014 9:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య

పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది.  మృతులలో 14 మంది మహిళలు ఉన్నారు.  ఈ దుర్ఘటనలో నిన్న 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.  కాకినాడ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ  మరో ఆరుగురు మృతి చెందారు.  మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు.

ఇదిలా ఉండగా,  ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement