ప్రచారం ఆధారంగా బాబు పరిహారం!:వైఎస్ జగన్
కాకినాడ: ప్రచారం ఆధారంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడినవారిని ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు పరిహారం చంద్రబాబు సరైన రీతిలో ప్రకటించడంలేదని అన్నారు. ప్రచారం ఎక్కువగా జరుగుతుందని అనుకుంటే అక్కడ 5 లక్షల రూపాయలు ప్రకటిస్తారని చెప్పారు. తక్కువ ప్రచారం ఉన్నచోట లక్ష లేక రెండు లక్షల రూపాయలే ప్రకటిస్తారని అన్నారు. ఈ గ్రామంలో పేలుడు ఘటనలో చనిపోయినవారందరూ కూలీలేనని చెప్పారు. పరిహారం అందరికీ సమానంగా ఉండాలని జగన్ డిమాండ్ చేశారు.
**