Vakatippa
-
ఆరని మంటలు
వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రం వద్ద పేలుడు సంఘటనకు రెండేళ్లు బాధితులను పట్టించుకోని ప్రభుత్వం దయనీయ స్థితిలో కుటుంబాలు అందరి కళ్లలో వెలుగు పూలు పూయించే దీపావళి ఇంక రెండు రోజులే.. పిల్లల్లో వెల్లివిరుస్తున్న ఉత్సాహం.. పండక్కి నాలుగు డబ్బులు చేసుకుందామనుకున్న వారి జీవితాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చింది ఆరోజు. ఆ దుస్సంఘటనను తలుచుకుంటే నేటికీ మనసు కలతబారుతుంది. అదే వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రం వద్ద సంభవించిన పెను విస్ఫోటనం. 18 మందిని బలిగొన్న ఆదుర్ఘటనకు రెండేళ్లు నిండాయి. తమవారిని కోల్పోయిన ఆ కుటుంబాల్లో నేటికీ తీరని ఆవేదనే. వారిని కదిలిస్తే వారిగుండెల్లోని ఆరనిమంటలు భగ్గున పైకెగుస్తున్నాయి. – పిఠాపురం పేలుడు జరిగిన దుర్దినం అందరూ దీపావళి పండుగ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. పిల్లలు తాము కాల్చుకొనే బాణసంచా గురించి ఊసులు చెప్పుకుంటున్నారు. 2014 అక్టోబర్ 20. మరో రెండు రోజుల్లో దీపావళి. గ్రామాల్లో పండుగ వాతావరణం. వ్యవసాయ కూలిపనులు లేని రోజుల్లో నాలుగు డబ్బులు ఎక్కువ ఇస్తానని ఫైర్వర్క్స్ ఫ్యాక్టరీ యజమాని చెప్పడంతో 21 మంది పనిలోకి వచ్చారు. ఆరోజుతో మందుగుండు సామగ్రి తయారీ పూర్తవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు పని పూర్తి చేసి అందరూ ఇంటికి వెళ్లిపోవాలని గబగబా పనులు చేసుకుంటున్నారు. పనిపూర్తయితే డబ్బుతో పాటు మందుగుండు సామగ్రి కూడా ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటలైంది. అప్పటికే మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి కొనుగోలు దారులు వస్తున్నారు. వారికి సాయంత్ర 5 దాటాకా రండని మందుగుండు సామగ్రి తయారీ కేంద్ర యజమాని చెబుతున్నాడు. అమ్మకాలు ప్రారంభించడానికి యజమాని అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఆరుబయట టెంట్ వేసి మందుగుండు సామాగ్రిని బయటకు తరలించడం ప్రారంభించారు. సరిగ్గా 3. 30 గంటలకు మందుగుండు తయారీ కేంద్రంలో పేలుడు. వేయి బాంబులు ఒక్క సారిగా పేలిన శబ్దాలు. పెను మంటలు. స్థానికుల హృదయాలను దహించేసిన ఆమంటలు 18 మందిని పొట్టన పెట్టుకున్నాయి. 30 కుటుంబాల్లో చీకట్లు కమ్మాయి. బాణసంచా తెస్తామన్నారు.. కాలి బూడిదయ్యారు కూలి డబ్బులు తెస్తా. నీకు మందుగుండు సామాన్లు తీసుకొస్తా అంటూ కుటుంబ సభ్యులకు, పిల్లలకు చెప్పి వెళ్లిన వారు ఇంటికి రాకుండా కాటికి వెళ్లిపోయారు. కాల్చుకోడానికి బాణాసంచా తెస్తానన్న వారుకడసారి చూపుకు కూడా నోచుకోకుండా కాలిబూడిదై పోయారు. ఏశవం ఎవరిదో తెలియని హృదయవిదారకమైన పరిస్థిలో అశువులు బాసిన వారి మృతదేహాలను నేరుగా శ్మశానవాటికకు తరలించారు. వారి బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు. ఏకంగా 18 మంది చూడడానికి ఆకారం లేదు . గుర్తు పడదామంటే ఆనవాళ్లు లేవు. తెల్లగుడ్డలలో కట్టిచ్చిన మూటలే వారి మృతదేహాలుగా భావించి ఖననం చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్లో ఆమూడు గ్రామాల వారు గొల్లుమన్నారు. పంటపొలాల్లో నెత్తురు ముద్దలు పేలుడు ధాటికి చెల్లా చెదురుగా అక్కడ పని చేస్తున్నవారు ఎగిరి పడడంతో పచ్చనిపంటపొలాల్లో నెత్తురు ముద్దలతో వాకతిప్ప గ్రామం మరుభూమిగా మారిపోయింది. సంఘటనాస్థలం నుంచి సుమారు 500 మీటర్ల వ్యాసార్ధంలో పొలాలు, కొబ్బరి తోటలు నెత్తుటి మరకలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా క్షతగాత్రుల శరీరభాగాలు కనిపిస్తూ ఆప్రాంతం భయానకంగా మారింది. విస్పోటనం ధాటికి సంఘటనాస్థలం పక్కనే ఉన్న పంటపొలం సుమారు అరెకరం వ్యాసార్థ్దంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. కొబ్బరి, మామిడి టేకు చెట్లు నిలువునా దహించుకుపోయాయి. చెట్ల కొమ్మలకు ఎముకలు వేలాడాయి. సుమారు 500 మీటర్ల దూరంలో పూర్తిగా కాలిపోయి శరీరభాగాలు, చెల్లాచెదురైన మృతదేహాలు దొరికాయి. కొబ్బరిచెట్లే కాపాడాయా..? సంఘటనాస్థలాన్ని పరిశీలించిన నిపుణులు సుమారు 1000 కేజీల మందుగుండుతో పేలిన మందుపాతర అంత విధ్వంసం సృష్టించిందని తేల్చారు. సంఘటనాస్థలం చుట్టు ఉన్న కొబ్బరిచెట్లు పేలుడుకు ఎగిసిపడిన శి«ధిలాలను, మంటలను దూరంగా వెళ్లకుండా నిరోధించగలిగాయన్నారు. అవి కొబ్బరిచెట్లకు తగిలి అక్కడికక్కడే పడిపోవడంతో ప్రమాదం తప్పిందని అగ్నిమాపక అధికారులు అన్నారు. లేకుంటే ఆ అగ్నికీలలు వాకతిప్ప గ్రామాన్ని బూడిద కుప్పగా మార్చేవన్నారు. మూగజీవాలనూ వదలని విస్ఫోటనం ఈ పేలుడు ధాటికి మూగజీవాలు సైతం బలైపోయాయి. ఆప్రాంతలో ఉన్న శునకాలు తీవ్రగాయాల పాలయ్యాయి. మంటల ధాటికి పక్కనే పొలాల్లో కట్టిఉన్న కొన్ని పశువులు విలవిలలాడుతుంటే స్థానికులు వాటికట్లు విడదీశారు. దాంతో అవి పరుగులు తీసి ప్రాణాలు నిలుపుకున్నాయి. అందని చేయూత బాదిత కుటుంబాల పిల్లలకు ఉచిత కార్పొరేట్విద్య, హాస్టల్ వసతి, ఇళ్లు, ప్రభుత్వ ప«థకాల ద్వారా ఆర్ధిక సహాయం, ఇంటికో ఉద్యోగం, అరెకరం భూమి ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటామంటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో మృతదేహాలను పరిశీలించి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అప్పట్లో అందజేసిన ఆర్ధిక సహాయం తప్ప మిగిలినవి ఏమీ అందలేదని బాధితులు వాపోతున్నారు. ఆగిన భూపంపిణీ ప్రమాద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి అరెకరం భూమి ఇస్తామని ప్రభుత్వం ఇచ్ని హామీ మేరకు అధికారులు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సమీపంలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. బాదితులకు పంపిణీ చేసేందుకు పట్టాలు సిద్దం చేసారు. కానీ ఆభూమి సెజ్‌కు సమీపంలో ఉండడంతో దాని విలువ రూ, కోట్లకు చేరుతుందన్న ముందస్తుసమాచారంతో ముఖ్యనేత ఆభూమిపై కన్నువేయడంతో పట్టాల పంపిణీ ఏడాదిగా ఆగిపోయింది. బాదిత కుటుంబాలు ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. జగన్ రాకతో పెరిగిన నష్టపరిహారం ఒక్కో మృతుని కుటుంబానికి రూ, 2లక్షల పరిహారం అందజేస్తామని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. అయితే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహæన్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ. 50 వేల చొప్పున వెనువెంటనే పరిహారం అందించారు. రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతో దిగి వచ్చిన ప్రభుత్వం నష్టపరిహారాన్ని రూ, 3లక్షలకు పెంచి పంపిణీ చేసింది. దయనీయ స్థితిలో బాధిత కుటుంబాలు తండ్రిని కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య, పిల్లలను కోల్పోయిన తల్లి , చెల్లిని కోల్పోయిన అన్న.. ఇలా తమ రక్తసంబంధీకులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో గత రెండేళ్ల నుంచి ఆ కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి . ప్రమాదంలో దమ్ము గుర్రయ్య మృతి చెందగా అతని భార్య మంగాదేవి, పిల్లలు విమలాదేవి, ప్రమీల అనాథలుగా మిగిలారు. బాధితులను ఆదుకుంటామని, వారి పిల్లలను చదివిస్తామన్న నాయకులు కానరాకుండా పోవడంతో అప్పులు చేసి ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నానని మంగాదేవి కన్నీటిపర్యంతమవుతోంది. ఆ ముందురోజే జరిగి ఉంటే.. ఆ ముందు రోజు వరకూ వందల సంఖ్యలోవిద్యార్థులు మతాబులను తయారు చేశారు. ఆరోజు సోమవారం పాఠశాల ఉండడంతో వారు పనిలోకి రాలేదని స్థానికులు తెలిపారు. లేకుంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదన్నారు. కాగితాలకే పరిమితమైన విచారణ సంఘటనపై కాకినాడ ఆర్డీఓ నిర్వహించిన మేజిస్టీరియల్ విచారణ కాగితాలకే పరిమితమైంది. అసలు ఆసంఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనేది మిస్టరీగానే మిగిలింది. 18 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటనపై విచారణ తీరు సైతం తీవ్రవిమర్శలకు దారితీసింది. రెండేళ్లయినా ఆవిచారణ ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. జగన్తప్ప ఎవరూ పట్టించుకోలేదు ఆప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాను. అప్పట్లో ఎన్నో ఇస్తామన్నారు కానీ ఏదీ పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోడం మానేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహ¯ŒSరెడ్డి వచ్చి స్వయంగా పరామర్శించి రూ. 20 వేలు ఆర్థిక సహాయం చేశారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. మృతుల కుటుంబాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం ఎంత వరకు సమంజసం? గాయాలపాలై నెలల తరబడి మంచంపై ఉండాల్సి వచ్చింది. కుటుంబ పోషణ భారమైంది. ఎవరూ పట్టించుకొనకపోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకున్నా. – కుక్కల శ్రీనివాసరావు, ప్రమాదంలో గాయపడిన బాధితుడు, వాకతిప్ప దళితులం కాబట్టే వదిలేశారు ప్రమాదంలో నాతల్లి మృతి చెందింది. కళ్లముందే మావాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీS చెప్పడం లేదు. విచారణ కూడా అంతా లోపభూయిష్టంగా జరిగింది. మాకు ఇస్తామన్న ఏఒక్కటీ సరిగ్గా ఇవ్వలేదు. భూమి ఇస్తామని చెప్పారు. ఏడాది పాటు ఆఊసు ఎత్తలేదు. చివరకు ఆందోళనకు దిగగా భూమికి పట్టాలు ఇచ్చారు. అవి కూడా కొన్ని నెలల పాటు పంపిణీ చేయలేదు. పట్టాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా భూమి అప్పగించ లేదు. మాకు ఇస్తున్నామని చెబుతున్న భూమి ఉప్పుటేరు కావడంతో గోతుల మయంగా ఉంది. దాన్ని ఎత్తు చేసి ఇస్తామన్నారు. కానీ నెలలు గడుస్తున్నా ఎటువంటి పనులు చేయలేదు. భూమి అప్పగించలేదు. – ద్రాక్షారపు నాగేశ్వరరావు, బాధితుడు, వాకతిప్ప -
ఆరని మంటలు
► వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రం వద్ద పేలుడు సంఘటనకు రెండేళ్లు ► బాధితులను పట్టించుకోని ప్రభుత్వం ► దయనీయ స్థితిలో కుటుంబాలు పిఠాపురం (తూర్పుగోదావరి జిల్లా): అందరి కళ్లలో వెలుగు పూలు పూయించే దీపావళి ఇంక రెండు రోజులే.. పిల్లల్లో వెల్లివిరుస్తున్న ఉత్సాహం.. పండక్కి నాలుగు డబ్బులు చేసుకుందామనుకున్న వారి జీవితాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చింది ఆరోజు. ఆ దుస్సంఘటనను తలుచుకుంటే నేటికీ మనసు కలతబారుతుంది. అదే వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రం వద్ద సంభవించిన పెను విస్ఫోటనం. 18 మందిని బలిగొన్న ఆదుర్ఘటనకు రెండేళ్లు నిండాయి. తమవారిని కోల్పోయిన ఆ కుటుంబాల్లో నేటికీ తీరని ఆవేదనే. వారిని కదిలిస్తే వారిగుండెల్లోని ఆరనిమంటలు భగ్గున పైకెగుస్తున్నాయి. పేలుడు జరిగిన దుర్దినం అందరూ దీపావళి పండుగ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. పిల్లలు తాము కాల్చుకొనే బాణసంచా గురించి ఊసులు చెప్పుకుంటున్నారు. 2014 అక్టోబర్ 20. మరో రెండు రోజుల్లో దీపావళి. గ్రామాల్లో పండుగ వాతావరణం. వ్యవసాయ కూలిపనులు లేని రోజుల్లో నాలుగు డబ్బులు ఎక్కువ ఇస్తానని ఫైర్వర్క్స్ ఫ్యాక్టరీ యజమాని చెప్పడంతో 21 మంది పనిలోకి వచ్చారు. ఆరోజుతో మందుగుండు సామగ్రి తయారీ పూర్తవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు పని పూర్తి చేసి అందరూ ఇంటికి వెళ్లిపోవాలని గబగబా పనులు చేసుకుంటున్నారు. పనిపూర్తయితే డబ్బుతో పాటు మందుగుండు సామగ్రి కూడా ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటలైంది. అప్పటికే మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి కొనుగోలు దారులు వస్తున్నారు. వారికి సాయంత్ర 5 దాటాకా రండని మందుగుండు సామగ్రి తయారీ కేంద్ర యజమాని చెబుతున్నాడు. అమ్మకాలు ప్రారంభించడానికి యజమాని అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఆరుబయట టెంట్ వేసి మందుగుండు సామాగ్రిని బయటకు తరలించడం ప్రారంభించారు. సరిగ్గా 3. 30 గంటలకు మందుగుండు తయారీ కేంద్రంలో పేలుడు. వేయి బాంబులు ఒక్క సారిగా పేలిన శబ్దాలు. పెను మంటలు. స్థానికుల హృదయాలను దహించేసిన ఆమంటలు 18 మందిని పొట్టన పెట్టుకున్నాయి. 30 కుటుంబాల్లో చీకట్లు కమ్మాయి. బాణసంచా తెస్తామన్నారు.. కాలి బూడిదయ్యారు కూలి డబ్బులు తెస్తా. నీకు మందుగుండు సామాన్లు తీసుకొస్తా అంటూ కుటుంబ సభ్యులకు, పిల్లలకు చెప్పి వెళ్లిన వారు ఇంటికి రాకుండా కాటికి వెళ్లిపోయారు. కాల్చుకోడానికి బాణాసంచా తెస్తానన్న వారుకడసారి చూపుకు కూడా నోచుకోకుండా కాలిబూడిదై పోయారు. ఏశవం ఎవరిదో తెలియని హృదయవిదారకమైన పరిస్థిలో అశువులు బాసిన వారి మృతదేహాలను నేరుగా శ్మశానవాటికకు తరలించారు. వారి బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు. ఏకంగా 18 మంది చూడడానికి ఆకారం లేదు . గుర్తు పడదామంటే ఆనవాళ్లు లేవు. తెల్లగుడ్డలలో కట్టిచ్చిన మూటలే వారి మృతదేహాలుగా భావించి ఖననం చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్లో ఆమూడు గ్రామాల వారు గొల్లుమన్నారు. పంటపొలాల్లో నెత్తురు ముద్దలు పేలుడు ధాటికి చెల్లా చెదురుగా అక్కడ పని చేస్తున్నవారు ఎగిరి పడడంతో పచ్చనిపంటపొలాల్లో నెత్తురు ముద్దలతో వాకతిప్ప గ్రామం మరుభూమిగా మారిపోయింది. సంఘటనాస్థలం నుంచి సుమారు 500 మీటర్ల వ్యాసార్ధంలో పొలాలు, కొబ్బరి తోటలు నెత్తుటి మరకలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా క్షతగాత్రుల శరీరభాగాలు కనిపిస్తూ ఆప్రాంతం భయానకంగా మారింది. విస్పోటనం ధాటికి సంఘటనాస్థలం పక్కనే ఉన్న పంటపొలం సుమారు అరెకరం వ్యాసార్థ్దంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. కొబ్బరి, మామిడి టేకు చెట్లు నిలువునా దహించుకుపోయాయి. చెట్ల కొమ్మలకు ఎముకలు వేలాడాయి. సుమారు 500 మీటర్ల దూరంలో పూర్తిగా కాలిపోయి శరీరభాగాలు, చెల్లాచెదురైన మృతదేహాలు దొరికాయి. కొబ్బరిచెట్లే కాపాడాయా..? సంఘటనాస్థలాన్ని పరిశీలించిన నిపుణులు సుమారు 1000 కేజీల మందుగుండుతో పేలిన మందుపాతర అంత విధ్వంసం సృష్టించిందని తేల్చారు. సంఘటనాస్థలం చుట్టు ఉన్న కొబ్బరిచెట్లు పేలుడుకు ఎగిసిపడిన శి«ధిలాలను, మంటలను దూరంగా వెళ్లకుండా నిరోధించగలిగాయన్నారు. అవి కొబ్బరిచెట్లకు తగిలి అక్కడికక్కడే పడిపోవడంతో ప్రమాదం తప్పిందని అగ్నిమాపక అధికారులు అన్నారు. లేకుంటే ఆ అగ్నికీలలు వాకతిప్ప గ్రామాన్ని బూడిద కుప్పగా మార్చేవన్నారు. మూగజీవాలనూ వదలని విస్ఫోటనం ఈ పేలుడు ధాటికి మూగజీవాలు సైతం బలైపోయాయి. ఆప్రాంతలో ఉన్న శునకాలు తీవ్రగాయాల పాలయ్యాయి. మంటల ధాటికి పక్కనే పొలాల్లో కట్టిఉన్న కొన్ని పశువులు విలవిలలాడుతుంటే స్థానికులు వాటికట్లు విడదీశారు. దాంతో అవి పరుగులు తీసి ప్రాణాలు నిలుపుకున్నాయి. అందని చేయూత బాదిత కుటుంబాల పిల్లలకు ఉచిత కార్పొరేట్విద్య, హాస్టల్ వసతి, ఇళ్లు, ప్రభుత్వ ప«థకాల ద్వారా ఆర్ధిక సహాయం, ఇంటికో ఉద్యోగం, అరెకరం భూమి ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటామంటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో మృతదేహాలను పరిశీలించి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అప్పట్లో అందజేసిన ఆర్ధిక సహాయం తప్ప మిగిలినవి ఏమీ అందలేదని బాధితులు వాపోతున్నారు. ఆగిన భూపంపిణీ ప్రమాద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి అరెకరం భూమి ఇస్తామని ప్రభుత్వం ఇచ్ని హామీ మేరకు అధికారులు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సమీపంలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. బాదితులకు పంపిణీ చేసేందుకు పట్టాలు సిద్దం చేసారు. కానీ ఆభూమి సెజ్‌కు సమీపంలో ఉండడంతో దాని విలువ రూ, కోట్లకు చేరుతుందన్న ముందస్తుసమాచారంతో ముఖ్యనేత ఆభూమిపై కన్నువేయడంతో పట్టాల పంపిణీ ఏడాదిగా ఆగిపోయింది. బాదిత కుటుంబాలు ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. జగన్ రాకతో పెరిగిన నష్టపరిహారం ఒక్కో మృతుని కుటుంబానికి రూ, 2లక్షల పరిహారం అందజేస్తామని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. అయితే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహæన్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ. 50 వేల చొప్పున వెనువెంటనే పరిహారం అందించారు. రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతో దిగి వచ్చిన ప్రభుత్వం నష్టపరిహారాన్ని రూ, 3లక్షలకు పెంచి పంపిణీ చేసింది. దయనీయ స్థితిలో బాధిత కుటుంబాలు తండ్రిని కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య, పిల్లలను కోల్పోయిన తల్లి , చెల్లిని కోల్పోయిన అన్న.. ఇలా తమ రక్తసంబంధీకులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో గత రెండేళ్ల నుంచి ఆ కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి . ప్రమాదంలో దమ్ము గుర్రయ్య మృతి చెందగా అతని భార్య మంగాదేవి, పిల్లలు విమలాదేవి, ప్రమీల అనాథలుగా మిగిలారు. బాధితులను ఆదుకుంటామని, వారి పిల్లలను చదివిస్తామన్న నాయకులు కానరాకుండా పోవడంతో అప్పులు చేసి ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నానని మంగాదేవి కన్నీటిపర్యంతమవుతోంది. ఆ ముందురోజే జరిగి ఉంటే.. ఆ ముందు రోజు వరకూ వందల సంఖ్యలోవిద్యార్థులు మతాబులను తయారు చేశారు. ఆరోజు సోమవారం పాఠశాల ఉండడంతో వారు పనిలోకి రాలేదని స్థానికులు తెలిపారు. లేకుంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదన్నారు. కాగితాలకే పరిమితమైన విచారణ సంఘటనపై కాకినాడ ఆర్డీఓ నిర్వహించిన మేజిస్టీరియల్ విచారణ కాగితాలకే పరిమితమైంది. అసలు ఆసంఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనేది మిస్టరీగానే మిగిలింది. 18 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటనపై విచారణ తీరు సైతం తీవ్రవిమర్శలకు దారితీసింది. రెండేళ్లయినా ఆవిచారణ ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. జగన్తప్ప ఎవరూ పట్టించుకోలేదు ఆప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాను. అప్పట్లో ఎన్నో ఇస్తామన్నారు కానీ ఏదీ పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోడం మానేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహ¯ŒSరెడ్డి వచ్చి స్వయంగా పరామర్శించి రూ. 20 వేలు ఆర్థిక సహాయం చేశారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. మృతుల కుటుంబాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం ఎంత వరకు సమంజసం? గాయాలపాలై నెలల తరబడి మంచంపై ఉండాల్సి వచ్చింది. కుటుంబ పోషణ భారమైంది. ఎవరూ పట్టించుకొనకపోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకున్నా. – కుక్కల శ్రీనివాసరావు, ప్రమాదంలో గాయపడిన బాధితుడు, వాకతిప్ప దళితులం కాబట్టే వదిలేశారు ప్రమాదంలో నాతల్లి మృతి చెందింది. కళ్లముందే మావాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీS చెప్పడం లేదు. విచారణ కూడా అంతా లోపభూయిష్టంగా జరిగింది. మాకు ఇస్తామన్న ఏఒక్కటీ సరిగ్గా ఇవ్వలేదు. భూమి ఇస్తామని చెప్పారు. ఏడాది పాటు ఆఊసు ఎత్తలేదు. చివరకు ఆందోళనకు దిగగా భూమికి పట్టాలు ఇచ్చారు. అవి కూడా కొన్ని నెలల పాటు పంపిణీ చేయలేదు. పట్టాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా భూమి అప్పగించ లేదు. మాకు ఇస్తున్నామని చెబుతున్న భూమి ఉప్పుటేరు కావడంతో గోతుల మయంగా ఉంది. దాన్ని ఎత్తు చేసి ఇస్తామన్నారు. కానీ నెలలు గడుస్తున్నా ఎటువంటి పనులు చేయలేదు. భూమి అప్పగించలేదు. – ద్రాక్షారపు నాగేశ్వరరావు, బాధితుడు, వాకతిప్ప -
వాకతిప్ప భూములపై.. రాజకీయ రాబందు!
సరిగ్గా ఎనిమిది నెలల కిందట.. కొత్తపల్లి మండలం వాకతిప్పలో.. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర విస్ఫోటం.. 18మంది ప్రాణాలను బలిగొంది. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఆ సమయంలో మంత్రులు ఆర్భాటంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారులు వారికి కాస్త భూమి కేటాయించారు. కానీ, ఇప్పటివరకూ ఆ భూములు మాత్రం బాధితుల అనుభవంలోకి రాలేదు. అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నేత కన్ను ఈ భూములపై పడడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : వాకతిప్ప బాణసంచా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తామన్న భూమి అందకుండా నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో గత ఏడాది అక్టోబర్ 20న సంభవించిన భారీ పేలుడులో 18 మంది దుర్మరణం పాలయ్యారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఆ సమయంలో మంత్రులు భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం, సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ప్రతి బాధిత కుటుంబానికీ అర ఎకరం భూమి ఇస్తామని చెప్పింది. విస్ఫోటం జరిగిన నెల రోజుల్లోనే కొత్త మూలపేట సమీపాన భూమి గుర్తించి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున 18 మందికి బాధిత కుటుంబాల యజమానుల పేరుతో పట్టాలు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి 8 నెలలైనా ఇంతవరకూ పంపిణీ చేయలేదు. చివరకు తమ పేరుతో వచ్చిన పట్టాలు ఎక్కడున్నాయో కూడా చెప్పడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అడ్డుకుంటున్న ముఖ్య నేత తాను చెప్పేవరకూ ఆ పట్టాలు పంపిణీ చేయవద్దంటూ నియోజకవర్గంలోని ఒక ముఖ్యనేత అడ్డం పడడమే ఇందుకు కారణమని తెలిసింది. బాధితులకు కేటాయించిన భూమి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్ఈజెడ్) సమీపంలో ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పా రిశ్రామికీకరణ జరుగుతోంది. పట్టాలిచ్చేందుకు గుర్తిం చిన భూముల వద్ద రోడ్డుకు ఇటువైపు కేఎస్‌ఈజెడ్‌లో తొలిగా చైనాకు చెందిన బొమ్మల పరిశ్రమ ఏర్పాటైంది. మిగిలిన భూముల్లోనూ త్వరలో పరిశ్రమలు రానున్నా యి. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమికి రూ.3 లక్షల నుం చి రూ.5 లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ భూములపై ముఖ్య నేత కన్ను పడిందని.. ఆ భూమిని తమ బినామీలకు కట్టబెట్టి సొమ్ము చేసుకోవచ్చన్న దురాలోచనతోనే.. తమకు కేటాయించిన భూములకు పట్టాలు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఎకరం భూమి ధర సుమారు రూ.కోటికి చేరుతుందన్న ఆశతో.. తమ నోటి దగ్గర కూడు కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులు, రాష్ట్ర మంత్రులవద్దకు పలుమార్లు తిరిగినా ఫలితం లేదని వారు చెబుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు.. సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా పట్టాలు ఇవ్వడం లేదు. భూమి ఇస్తామని స్థలం కూడా నిర్ణయించినా సంబంధించిన పట్టాలు ఎక్కడున్నాయో తెలీదు. ఎంతమంది దగ్గరకు తిరిగినా పట్టించుకోవడం లేదు. - ద్రాక్షారపు రాజు, బాధిత కుటుంబీకుడు, వాకతిప్ప జాప్యం దేనికో.. సంఘటన జరిగినప్పుడు ఎందరో వచ్చారు. ఎన్నో చేస్తామన్నారు. మాకు కేటాయించిన భూమిని పంపిణీ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అప్పట్లో భూమి ఇస్తున్నట్లు ప్రకటించిన నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. - మసకపల్లి సుబ్రహ్మణ్యం, బాధిత కుటుంబీకుడు, వాకతిప్ప పలు కారణాలతో పంపిణీ ఆగింది.. పట్టాలు ఎప్పుడో తయారు చేసి పంపిణీకి కూడా ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులతో పంపిణీ చేయించాలంటూ అప్పట్లో నిలుపు చేశారు. తరువాత వివిధ కారణాలతో పంపిణీ ఆగింది. - ప్రసాద్, ఇన్చార్జితహశీల్దార్, కొత్తపలి -
వాకతిప్ప బాధితులను ఆదుకోవాలి
కొత్తపల్లి : వాకతిప్ప బాణసంచా విస్ఫోటంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మృతుల కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు చేస్తున్న ధ ర్నాకు ఆయన మద్దతు పలికారు. తొలుత మృతులకు ఆత్మశాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. ప్రమాదం జరిగి 36 రోజులవుతున్నా, ఇప్పటి వరకూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయలేదని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ద్రాక్షారపు చిన్నబుల్లి కుటుంబానికి రూ.మూడు లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు పంపిణి చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోందన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని, ఒక్కొక్క కుటుంబానికి అర ఎకరం కాదని రెండన్నర నుంచి ఐదు ఎకరాల వరకూ భూమి ఇవ్వాలని, మృతుల కుటుంబాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. సంఘటన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి స్పందించి అన్ని కుటుంబాలకు పార్టీ తరఫున సహాయం అందించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు, పిఠాపురం మాజీ ఎంపీపీ కురమళ్ల రాంబాబు, కొత్తపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు మాదిరెడ్డి దొరబాబు, ఎంపీటీసీ సభ్యులు తోటకూర మారెమ్మ, యేడిద పెదతల్లి, ఆనాల సుదర్శన్, తొమ్మండ్ర సురేష్, గోపి సత్యనారాయణ, ఎ.బాబూరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతాం కోటగుమ్మం,(రాజమండ్రి) : కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో జరిగిన బాణ సంచా పేలుడు ప్రమాదంలో మరణించిన 18 కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేలుడు బాధితులను ఆదుకోవడంలో ఎమ్మెల్యే వర్మ విఫలమయ్యారని పేర్కొన్నారు. పేలుడు బాధితురాలు చిన్నితల్లికి కూడా రూ.మూడు లక్షలు చెక్కును అందజేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఐదు ఎకరాల భూమిని మంజూరు చేయాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, హౌసింగ్ బోర్డు ద్వారా పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబంలోని పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ పార్టీలు వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వైరాల అప్పారావు, ఏడో డివిజన్ కార్పొరేటర్ కోరిమిల్లి విజయ శేఖర్, మాదిగ న్యాయవాదుల రాష్ట్ర కన్వీనర్ కొత్తపల్లి ప్రసాదరావు, యార్లగడ్డ అశోక్ , ఉండ్రాజవరపు గోపి, సిమెంట్రీపేట నాయకులు వైరాల రమేష్, రాయి డేవిడ్, ఎన్. రమణ, తదితరులు పాల్గొన్నారు. -
వాకతిప్ప దుర్ఘటనపై నేడు విచారణ
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్పలో గత నెల 20న సంభవించిన బాణసంచా పేలుడు ఘటనపై సోమవారం మేజిస్టీరియల్ విచారణ నిర్వహిస్తున్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది మృత్యువాత పడగా, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి విచారణ నిర్వహిస్తారు. పేలుడు ఘటనపై ఎటువంటి అనుమానాలున్నా, సంఘటనకు సంబంధించి ఆధారాలున్నా నిర్భయంగా తమకు తెలియజేయవచ్చని చెప్పారు. ఇప్పటికే సంఘటన జరిగిన శ్రీమణికంఠ ఫైర్ వర్క్స్‌కు అన్ని అనుమతులను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రచారం ఆధారంగా బాబు పరిహారం!:వైఎస్ జగన్
కాకినాడ: ప్రచారం ఆధారంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడినవారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు పరిహారం చంద్రబాబు సరైన రీతిలో ప్రకటించడంలేదని అన్నారు. ప్రచారం ఎక్కువగా జరుగుతుందని అనుకుంటే అక్కడ 5 లక్షల రూపాయలు ప్రకటిస్తారని చెప్పారు. తక్కువ ప్రచారం ఉన్నచోట లక్ష లేక రెండు లక్షల రూపాయలే ప్రకటిస్తారని అన్నారు. ఈ గ్రామంలో పేలుడు ఘటనలో చనిపోయినవారందరూ కూలీలేనని చెప్పారు. పరిహారం అందరికీ సమానంగా ఉండాలని జగన్ డిమాండ్ చేశారు. ** -
సర్కారే అసలు దోషి...
అడ్డగోలుగా బాణసంచా తయారీ కళ్లుమూసుకున్న యంత్రాంగం ► వాకతిప్ప విస్ఫోటంలో మరో నలుగురు మృతి.. 17కి పెరిగిన మృతుల సంఖ్య ► మృతుల్లో 15 మంది బడుగు మహిళలే..ఆచూకీ లేకుండా పోయిన మరో బాలిక ► లెసైన్సు రద్దయిన తర్వాతా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న వైనం ► తనిఖీలు చేయకుండానే లెసైన్సు పునరుద్ధరించాలంటూ సిఫారసులు ► cయు.కొత్తపల్లి తహశీల్దార్ సస్పెన్షన్.. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు కాకినాడ: ప్రభుత్వ యంత్రాంగం అలసత్వానికీ, నిర్లక్ష్యానికీ అమాయకులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పెను విస్ఫోటంలో మృతుల సంఖ్య 17కి చేరింది. వీరిలో 15 మంది బడుగువర్గాల మహిళలే. ఈ దుర్ఘటనలో మరో బాలిక ఆచూకీ లేకుండా పోయింది. వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన 11 మంది దుర్మరణం పాలు కాగా.. మిగిలిన వారు మరో రెండు గ్రామాలకు చెందినవారు. దీంతో మూడు గ్రామాల్లో విషాదం అలముకుంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ సామెత చందంగా ఇన్ని ప్రాణాలు బలయ్యాక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కాకినాడలో ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయత్నం ఇంతకు ముందే జరిగి ఉంటే బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఇన్ని ప్రాణాలు బలయ్యేవి కావని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 17కు పెరిగిన మృతుల సంఖ్య... వాకతిప్పలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మణికంఠ ఫైర్వర్క్స్లో సంభవించిన భారీ విస్ఫోటంలో సోమవారం 12 మంది మృతి చెందగా.. మంగళవారం తెల్లవారుజామున మరో నలుగురు మృతి చెందారు. ఉల్లంపర్తి కామరాజు (30), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35) కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరోవైపు.. సంఘటనా స్థలానికి అరకిలోమీటర్ దూరంలో పంటకాలువలో వాసంశెట్టి రాఘవ (50) అనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆచూకీ లేకుండా పోయిన 12 ఏళ్ల ఉండ్రాజపు కీర్తి కూడా మృతిచెంది ఉంటుందని అధికారులు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు. పరిసరాల్లో లభించిన తెగిపడ్డ ఓ కాలు ఆ బాలికదేనని భావిస్తున్నారు. అవసరమైతే లభించిన కాలికి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని చెప్తున్నారు. ఫైర్వర్క్స్ నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు, అతడి తల్లి లక్ష్మి, కుక్కల శ్రీనివాసరావు అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. లెసైన్సు రద్దయినా ఆగని తయారీ... వాకతిప్పలో మరణమృదంగానికి కారణమైన మణికంఠ ఫైర్‌వర్క్స్‌కు 2015 వరకు లెసైన్సు ఉన్నప్పటికీ పెరిగిన వ్యాపారానికి తగ్గట్టు ఫీజు చెల్లించని కారణంగా గత నెలలో లెసైన్సు రద్దు చేశారు. నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు కొత్తగా లెసైన్సు కోసం గతవారం పెట్టుకున్న దరఖాస్తు కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. అయినా బాణసంచా తయారీని ఆపలేదు. దరఖాస్తు చేయడానికి ముందు నుంచే (గత నెలన్నర రోజులుగా) బాణసంచా తయారుచేయిస్తూనే ఉన్నాడు. ఈ కేంద్రం నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున హోల్‌సేల్‌గా బాణసంచా సరఫరా చేస్తున్నారు. దీపావళి సందర్భంగా అమ్మకాల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన సరుకును కూడా శివకాశి నుంచి కొని, తెచ్చినట్టు సమాచారం. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. కళ్లు మూసుకున్న అధికారులు... బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలకు విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ బాణసంచా తయారు చేసేందుకు ప్రస్తుతం లెసైన్సు లేదు. గతంలో ఉన్న లెసైన్సు రద్దయింది. అన్ని కార్యకలాపాలూ నిబంధనలకు విరుద్ధంగా కళ్లెదుటే చేస్తున్నా అధికారుల కళ్లకు కనిపించనే లేదు. నెల రోజులు ముందుగానే దుకాణాలను తనిఖీ చేసి సరుకు నిల్వలు, తయారీ విధానం, పనిచేస్తున్న వారికి బీమా చేయించారా లేదా అనే వివరాలు స్వయంగా పరిశీలించాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, నివాస ప్రాంతాలు, నిత్యం జనసమ్మర్థం ఉండే ప్రాంతానికి సమీపాన అడ్డగోలుగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో తహశీల్దార్, అగ్నిమాపక అధికారులు, పోలీసులు.. ఎటువంటి తనిఖీలు లేకుండానే సర్టిఫై చేసి జిల్లా కేంద్రానికి లెసైన్సు పునరుద్ధరణకు సిఫారసు చేశారు. పర్యవసానంగా జరిగిన ఘోరం 17 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. దుర్ఘటనకు బాధ్యుడిగా యు.కొత్తపల్లి తహశీల్దార్ పినిపే సత్యనారాయణను సస్పెండ్ చేశారు. బాణసంచా కేంద్రం యాజమాన్యంపై ఐపీసీ 286, 337, 338, 304(2), 1884 ఎక్స్‌ప్లోజివ్ సబ్స్టాండ్స్ చట్టం సెక్షన్ 9బి ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. మృతదేహాల కోసం రాత్రి వరకూ పడిగాపులు... కాకినాడ జీజీహెచ్ ఫోరెన్సిక్ విభాగ వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం 15 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తెగిపడ్డ కాలినీ పరీక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో మానవత్వం లోపించింది. కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జీజీహెచ్‌లో పడిగాపులు పడాల్సి వచ్చింది. సీఎం వచ్చే వరకు మృతదేహాలను జీజీహెచ్‌లోనే ఉంచేయడం కుటుంబ సభ్యులను కలచివేసింది. ఉదయం 10.30 గంటలకు సీఎం వస్తున్నారని హైరానా పడ్డ అధికారులు హుటాహుటిన పోస్టుమార్టం పూర్తి చేసినా సీఎం మధ్యాహ్నం 3.30 గంటలవరకు రాకపోవడంతో అంతవరకు వేచి చూడాల్సి వచ్చింది. సీఎం వెళ్లిపోయాక మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటుచేసిన అంబులెన్స్‌లకు డీజిల్ పోసే బాధ్యతను రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు నెట్టుకోవడంతో బంధువులు రాత్రి వరకూ నిరీక్షించాల్సి వచ్చింది. పేలుడులో మృతుల వివరాలు... మసకపల్లి అప్పయమ్మ (55), మసకపల్లి గంగ (23), మసకపల్లి విజయకుమారి అలియాస్ బుజ్జి (28), ద్రాక్షారపు కాంతమ్మ (50), మసకపల్లి కుమారి (24), ద్రాక్షారపు చిన్నతల్లి (46), అద్దంకి నూకరత్నం (25), మసకపల్లి పుష్ప (35), ఉల్లంపర్తి కామరాజు (30), పిల్లి మణికంఠస్వామి (35), తుట్టా మంగ (40), తుట్టా సత్తిబాబు (20), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35), రాయుడు రాఘవ (40), వాసంశెట్టి రాఘవ (50). ఈ 17 మంది మృతి చెందగా.. ఉండ్రాజపు కీర్తి (12) అనే బాలిక ఆచూకీ లభ్యంకాలేదు. ఇక ఆస్పత్రిలో కుక్కల శ్రీనివాసరావు, కొప్పిశెట్టి లక్ష్మి, కొప్పిశెట్టి అప్పారావులు చికిత్సపొందుతున్నారు. -
అన్నివిధాలా ఆదుకుంటాం
కాకినాడ క్రైం / పిఠాపురం :వాకతిప్ప పేలుడు బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సోమవారం నాటి దుర్ఘటనలో బాధితులైన వారిని పరామర్శించేందుకు ఆయన మంగళవారం జిల్లాకు వచ్చారు. విజయవాడ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణం చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకే సీఎం వస్తారని చెప్పినా ఆయన కాకినాడ చేరుకునే సరికి మధ్యాహ్నం 3.30 గంటలైంది. పోలీసు కార్యాలయం ప్రాంగణం నుంచి కారులో కాకినాడ జీజీహెచ్ చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుర్ఘటన జరిగిన తీరు, మృతులు, చికిత్స పొందుతున్న వారి వివరాలు కలెక్టర్ నీతూప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని బాణ సంచా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ నుంచి కారులో వాకతిప్ప వెళ్లారు. అక్కడ ఎస్సీ కాలనీ వద్ద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత అనుకున్న దాని ప్రకారం ఆయన దుర్ఘటన స్థలానికి వెళ్లాల్సి ఉంది. అయితే సమయం లేనందున వెనుదిరిగారని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పారు. ముఖ్యమంత్రి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ రాముడు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు ఉన్నారు. కాగా దుర్ఘటన స్థలం వద్ద ముఖ్యమంత్రి రాకకోసం ఎదురు చూస్తున్న వారు ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. అయితే ముఖ్యమంత్రికి అత్యవసరమైన పని ఉందని, చీకటి పడుతుండడం వల్ల వెనుదిరిగారని ఎమ్మెల్యే వర్మ వారికి వివరించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.3 లక్షలకు పెంచారని, ఐఏవై గృహాలు నిర్మిస్తారని, మృతుల పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆదేశించారని చెప్పారు. తహసీల్దారు సస్పెన్షన్ కాగా పేలుడు ఘటనకు బాధ్యుడిగా కొత్తపల్లి తహసీల్దారు పినిపే సత్యనారాయణను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే వర్మ తెలిపారు. అనుమతి లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా, జనసమ్మర్దం గల ప్రాంతలో మందుగుండు సామగ్రి తయారు చేసి విక్రయిస్తుంటే తహసీల్దారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే ప్రమాదానికి ఆయనను బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నారని వివరించారు. -
పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య
-
పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి
-
పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. మృతులలో 14 మంది మహిళలు ఉన్నారు. ఈ దుర్ఘటనలో నిన్న 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు. ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ** -
పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణాసంచా పేలుడు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ** -
బతుకు బుగ్గి
-
వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందిన సంఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు. చిరంజీవి, రఘువీరా సంతాపం తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణా సంచా గోడౌన్లో పేలుడులో 12మంది మృత్యువాత పడిన ఘటన పట్ల రాజ్యసభ సభ్యుడు కె. చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనధికార బాణాసంచా తయారు చేస్తున్న ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాణా సంచా గోడౌన్లో పేలుడు మృతుల కుటుంబాలకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. -
బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు
12 మంది దుర్మరణం తూర్పు గోదావరి జిల్లాలో ఘోర దుర్ఘటన ఏడుగురికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం అనధికారికంగా కొబ్బరితోటలో బాణసంచా తయారీ బాణసంచాలో పొటాష్‌ను ఎక్కువ మోతాదుతో కూరడంతో పేలుడు?.. షార్ట్ సర్క్యూట్‌వల్ల కూడా జరిగి ఉండవచ్చని అనుమానం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారీ విస్ఫోటం భూకంపం సంభవించినట్టు అదిరిన ఇళ్లు, కొట్టుకున్న కిటికీలు.. చెల్లాచెదురుగా ఎగిరిపడ్డ శరీర భాగాలు మూడు గ్రామాల్లో విషాదం... మృతుల్లో ఎనిమిది మంది మహిళలే.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఘటనపై చంద్రబాబు, వైఎస్ జగన్, రఘువీరా దిగ్భ్రాంతి సాక్షి ప్రతినిధి, కాకినాడ: వెలుగుల పండుగకు ముందే బడుగుజీవుల బతుకులు కాలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన భారీ విస్పోటంలో 12 మంది దుర్మరణం పాలవ్వగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు కాకినాడలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులంతా వాకతిప్ప, కుతుకుడుమిల్లి శివారు పెదకలవలదొడ్డి, నిదానందొడ్డి, ఎస్సీ కాలనీలకు చెందిన రెక్కాడితేగాని డొక్కాడని ఎస్సీ, బీసీ వ్యవసాయ కూలీలే. మృతుల్లో పలువురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. సంఘటనా స్థలంలో తొమ్మిది మంది మృతి చెందగా, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఒకరు, అపోలో ఆస్పత్రిలో ఒకరు, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరొకరు మృతి చెందారు. దీపావళికి మూడు రోజుల ముందు సంభవించిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. వాకతిప్పలోని కొబ్బరితోటలో ఉన్న రేకులషెడ్‌లో కొప్పిశెట్టి వెంకటరమణ కుమారుడు అప్పారావు మణికంఠ ఫైర్వర్క్స్ పేరుతో 30 ఏళ్లుగా బాణసంచా తయారీ, విక్రయకేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగా అప్పారావు, తల్లి లక్ష్మి తయారీ కేంద్రానికి బయట టెంట్ వేసి బాణసంచా విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం లోపల 25 నుంచి 30 మంది వరకు బాణసంచా తయారీలో నిమగ్నమై ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ విస్ఫోటం సంభవించింది. పెనుశబ్దాలతో రెండుసార్లు పేలుడు సంభవించి ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పేలుడు శబ్దం ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల వరకు వినిపించింది. భూకంపం సంభవించినట్టు ఇళ్లు అదిరిపోయి తలుపులు, కిటికీలు కొట్టుకున్నాయి. ప్రజలు ప్రాణభయంతో గ్రామం విడిచిపెట్టి పిల్లాపాపలతో పరుగులుతీశారు. ఏమి జరుగుతుందో తెలిసేలోపే కొబ్బరితోటలోని బాణసంచా తయారు చేస్తున్న పెంకుటిల్లు, రేకుల షెడ్లు భస్మీపటలమయ్యాయి. మంటలు ఎగసిపడి 20 అడుగుల ఎత్తున ఉన్న కొబ్బరిచెట్లు కూడా కాలిపోయాయి. పేలుడు ధాటికి మృతుల శరీరభాగాలు సమీపంలోని పంటపొలాలు, కొబ్బరి తోటల్లో చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. పేలుడు 3 గంటల ప్రాంతంలో జరగగా, 20 నిమిషాలసేపు బాణసంచా పేలుతూనే ఉన్నాయి. అరగంటలో మొత్తం కాలిబూడిదైపోయింది. మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా పడి ఘటనా స్థలం మరుభూమిని తలపించింది. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న వారిని రక్షించేందుకు స్థానికులు తొలుత సాహసించలేకపోయారు. మందుగుండు సామగ్రి ఒకదాని తరువాత మరొకటి పేలుతుండ డంతో అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. మంటలు తగ్గుముఖంపట్టాక కొందరు ధైర్యం చేసి మంటల్లో ఉన్నవారిపై నీళ్లు చల్లి బయటకు తీసుకు రావడానికి ప్రయత్నించారు. క్షతగాత్రుల శరీరం ముక్కలు ముక్కలుగా ఊడిపోతుండటంతో గోనెసంచుల్లో వేసుకుని బయటకు తీసుకురావడం స్థానికుల హృదయాలను కలచివేసింది. క్షణాల్లో శవాలగుట్ట అప్పటివరకు పచ్చని పంటపొలాలు, కొబ్బరి చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా శవాలగుట్టగా మారిపోయింది. కళ్లుతెరిచేలోపే జరగరాని దారుణం జరిగిపోయింది. ఏమి జరిగిందో తెలిసేలోపే యజమాని కొప్పిశెట్టి అప్పారావు పేలుడు ధాటికి ఎగిరి దూరంగా పడ్డాడు. అతని కాలు విరిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతని తల్లి లక్ష్మి స్వల్పగాయాలతో బయటపడింది. మంటల్లో కాలిపోతున్న వారు కాలిపోతున్నట్టుగానే పరుగులుతీశారు. సంఘటనా స్థలానికి సమీపంలో పచ్చని వరిపొలాలు, కొబ్బరితోటలు రక్తమోడాయి. మృతుల్లో ఎనిమిది మంది మహిళలే. మూడు గ్రామాల్లో విషాదం ఈ దుర్ఘటనతో కుతుకుడుమిల్లి శివారు నిదానందొడ్డి, పెదకలవలదొడ్డి, వాకతిప్ప శివారు ఎస్సీ కాలనీల్లో విషాదం అలముకుంది. ఎస్సీ కాలనీకి చెందిన ఐదుగురు, నిదానందొడ్డికి చెందిన ఐదుగురు, పెద కలవలదొడ్డికి చెందిన ఒకరు ప్రమాదంలో మృతి చెందారు. ఇరుగుపొరుగు గ్రామాల్లో ఒకేసారి ఇంతమంది మృతిచెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కళ్లెదుటే కాలిపోయిన తమవారిని తలుచుకుంటూ బంధువులు కుమిలిపోతున్నారు. పొటాష్ కూరుడే కారణం..! ఈ ఘటనను దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ప్రమాదవశాత్తు జరిగిందని ప్రకటించారు. దీపావళి దగ్గరపడటం ఆర్డర్ ఎక్కువగా ఉండటంతో కార్మికులను ఎక్కువమందిని పెట్టి బాణసంచా తయారుచేస్తున్నారు. బాంబులలో ఉపయోగించే పొటాష్‌ను ఎక్కువ మోతాదుతో కూరడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఉంటుందని అగ్నిమాపక శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. బాణసంచా తయారీతోపాటు అప్పటికే తయారుచేసి హోల్‌సేల్‌గా విక్రయానికి సిద్ధం చేసిన సుమారు రెండు టన్నుల సరుకు కూడా తయారీ కేంద్రంలోనే ఉండటంతో ఈ భారీ విస్పోటం సంభవించిందనే వాదన కూడా వినిపిస్తోంది. లేకుంటే అంతటి ప్రాణనష్టం సంభవించేది కాదంటున్నారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ పేలుడు సంభవించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అనుమతిపై భిన్నాభిప్రాయాలు ప్రమాదం నుంచి బయటపడి, ప్రస్తుతం కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఫైర్వర్క్స్ యజమాని అప్పారావును అడగ్గా తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పాడు. కాగా గత మార్చి నెలతోనే అతని లెసైన్సు గడువు ముగిసిందని, ఇంకా రెన్యువల్ చేయించుకోలేదని, అనధికారికంగానే తయారీ జరుగుతోందని కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాత్రం అన్ని అనుమతులున్నాయని, సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పారు. అనంతరం కాకినాడలో ఒక ప్రకటన విడుదల చేస్తూ లెసైన్సు గడువు పూర్తయ్యిందని, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లెసైన్సు లేని బాణసంచా కేంద్రాలను మూసివేయాల్సిందిగా జిల్లా ఎస్పీలను ఆదేశించామన్నారు. ఇదిలా ఉండగా, లెసైన్సు రెన్యువల్ కానప్పుడు స్థానిక తహశీల్దార్, ఎస్ఐ, అగ్నిమాపక అధికారులు ఎలా తయారీకి అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం తనిఖీలు చేసి ఉన్నా ఈ విషయం బయటపడి ఇంత ప్రమాదం జరిగేది కాదంటున్నారు. మృతుల వివరాలు వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన ద్రాక్షారపు కాంతం(55), ద్రాక్షారపు చినబుల్లి(50), మసకపల్లి విజయకుమారి అలియాస్ బుజ్జి(30), మసకపల్లి కుమారి(25), మసకపల్లి అప్పాయమ్మ(50), మసకపల్లి పుష్ప (42), ఉలంపర్తి కామరాజు(40), అర్జిల్లి రత్నం(28), ఉండ్రాజపు కీర్తి(24), కుతుకుడుమిల్లి శివారు నిదానందొడ్డికి చెందిన వాసంశెట్టి రాఘవ(35), తుట్టా సత్తిబాబు(20), కాశి అప్పలరాజు(30) మృతి చెందినట్టు గుర్తించారు. తుట్టా మంగ, మసకపల్లి గంగ, తుట్టా నాగమణి, ఆరయుడు రాఘవ, మేడిశెట్టి నూకరత్నం,చుక్కా శ్రీనివాసరావు, కొప్పిశెట్టి లక్ష్మి తీవ్రగాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, వంగా గీత తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ప్రమాదంపై కలెక్టర్ నీతూకుమారి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణకు కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్‌ను విచారణాధికారిగా నియమించినట్టు సోమవారం రాత్రి కలెక్టర్ ప్రకటించారు.