వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందిన సంఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు.
చిరంజీవి, రఘువీరా సంతాపం
తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణా సంచా గోడౌన్‌లో పేలుడులో 12మంది మృత్యువాత పడిన ఘటన పట్ల రాజ్యసభ సభ్యుడు కె. చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనధికార బాణాసంచా తయారు చేస్తున్న ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాణా సంచా గోడౌన్‌లో పేలుడు మృతుల కుటుంబాలకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.